Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

బస్టాండ్‌లో బస్సులను తగలబెట్టిన ఎంఆర్‌పిఎస్ నాయకులు

busసంఘటనా స్థలం వద్ద వదిలిన జెండాలు
మందా క్రిష్ణమాదిగను విడుదల చేయాలని ప్లేకార్డ్
మన తెలంగాణ, వైరాః
వైరా ఆర్‌టిసి బస్టాండ్‌లో మధిర డిపోకు చెందిన బస్సు రాత్రి హాల్ట్‌లో భాగంగా బస్టాండ్‌లో నిలిపి డ్రైవర్, కండక్టర్ బస్టాండ్‌లోని రూమ్‌లో నిద్రిస్తున్నారు. రాత్రి 1.20గంటల సమయంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు వైరా బస్టాండ్‌లోకి వచ్చి ఆగి ఉన్న ఏపి20జెడ్0038 అనే మధిర డిపోకు చెందిన బస్సుకు పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడ ఎంఆర్‌పిఎస్ జెండాలతో పాటు జైలులో ఉంచిన మందా క్రిష్ణమాదిగను విడుదల చేయాలంటూ ప్లేకార్డులు సైతం వదిలి వెళ్లారు. రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వైరా పోలీసులు బస్టాండ్ వద్దకు వచ్చేటప్పటికి బస్టాండ్‌లో నుంచి పొగలు రావడం గమనించిన వారు ఏసిపి దాసరి ప్రసన్నకుమార్, సిఐ మల్లయ్యస్వామిలకు సమాచారం అందించడంతో హుటాహుటిన బస్టాండ్ వద్దకు చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఆర్‌టిసి బస్సు పాక్షికంగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఖమ్మం డిసిపి సురేష్‌కుమార్, ఏసిపి నరేష్‌రెడ్డి వైరా సంఘటనా స్థలం వద్దకు తమ సిబ్బందితో వచ్చారు. మరో ప్రక్క బస్టాండ్‌లో బస్సు కాలిపోయిన విషయంతో ఎస్సైలు నరేష్, మేడా ప్రసాద్, సురేష్, మొగిలిలు సిబ్బందితో గస్తీ నిర్వహించి సిసి పుటేజీలను సైతం పరిశీలించారు. బస్సు తగలబడటానికి కారకులైన వారి కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. మందా క్రిష్ణమాదిగను విడుదల చేయాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు ఈ బస్సును ధ్వంసం చేయడం జరిగిందని పోలీస్ అధికారుల సైతం తెలిపారు. విషయం తెలుసుకున్న మధిర డిఎం హర్ష వైరా బస్టాండ్ వద్దకు వచ్చి బస్సును పరిశీలించి పోలీస్ అధికారులతో మాట్లాడిన అనంతరం పోలీసులు బస్సును మధిరకు తరలించారు.

Comments

comments