Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

నా ఫేవరేట్ ప్లేస్ బీచ్

iliyana

ఒక్కొక్కరికి ఒక్కో ప్రదేశం అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్తే ఎంత సేపైనా గడపేస్తారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానాకు బీచ్‌లు అంటే మహా ఇష్టమట. బీచుల్లో గడిపేతే ఆ ఆనందమే వేరు అని అంటోంది ఈ భామ. పుట్టింది ముంబయ్‌లో అయినా… పెరిగింది గోవాలో కావడంతో ఇలియానాకు బీచ్‌లంటే ఎంతో ఇష్టమేర్పడిందట. “నా ఫేవరేట్ ప్లేస్ బీచ్. నాకు నేను ఓ బీచ్ బమ్ అనుకుంటూ ఉంటాను. కొంచెం ఖాళీగా ఉండే బీచ్‌కెళ్లి పోయి గడిపేస్తాను. ఎప్పుడెళ్లినా సరే… చీకటిపడే వరకు అక్కడే ఉండిపోతాను”అంటూ తనకు బీచ్‌లంటే ఎంత వెర్రో చెబుతోంది ఈ గోవా సుందరి. బీచ్‌లకు వెళ్లడమే కాదు అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తరచుగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. ఇదిలాఉండగా ఈ భామ తిరిగి టాలీవుడ్‌కు రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆమెకు ఇంతవరకు సరైన ఆఫర్ మాత్రం దక్కడం లేదు.

Comments

comments