Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

నా భర్త నక్సలైట్ కాదు

Death-image

గొర్రె తప్పిపోతే అడవికెళ్లాడుపోలీసులు పట్టుకుని కాల్చి చంపారుశ్రీను భార్య కృష్ణ కుమారి

మన తెలంగాణ/టేకులపల్లి:‘నా భర్త నక్సలైట్ కాదు.. అసలు వాళ్లకు మాకుఎటువంటి సంబంధం లేదు.వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాం. ఈ మధ్యే సబ్సిడీలో గొర్రెలు కూడా తీసుకున్నాం. ప్రతిరోజూ అడ వికి వెళ్లిఆ గొర్రెలను మేపుకుని వస్తుంటాడు. గొర్రె ఒకటి తప్పి పోయింది. వెతకడానికి అడవి కివెళ్లాడు. ఈక్రమంలో పోలీసులకు పట్టుకుని కావాలనే కాల్పిచంపారు.’ అంటూ ఎన్‌కౌం టర్‌లో మృతిచెందిన గాడుదుల శ్రీను భార్య కృష్ణవేణి రోదించ డం అందరినీకలచివేసింది. అసలు నక్సలైట్లకు ఎటువంటిసంబంధంలేని అమాయకుడిని పోలీసు లు పొట్టనబెట్టుకున్నారని శ్రీను తల్లిదండ్రు
లు గండెల విసేలా రోదించారు. శ్రీను నేపథ్యం… టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామానికిచెందిన శ్రీను అసలు సిసలైన రైతే. అతని కులం గొల్ల. కుల వృత్తి రీత్యాగొర్రెలను కూడా పోషించుకుంటున్నాడు. పిచ్చయ్య, నాగమ్మలకు కుమారుడు శ్రీనివాస్. భార్య క్రిష్ణ కుమారి, ఇద్దరుపిల్లలున్నారు. కొడుకు కిరణ్కొత్తగూడెంలో ఐటిఐ చదువుతున్నాడు. కూతురు భవాని కొత్తగూడెంలోడిగ్రీ చదువుకుంటోంది.

శ్రీను కు సొంత వ్యవసాయం ఉంది. గ్రామంలోఅందరితో పాటు కలిసి జీవిస్తూ, వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్నిసాదుకుంటున్నాడు. ఇటీవల కెసిఆర్ ప్రభుత్వం గొల్ల కురుమలకురాయితీ కింద 25 వంతున గొర్రెలను అందజేసింది. ప్రభుత్వం ఇచ్చినసబ్సీడీ గొర్రెలను శ్రీనివాస్ కూడా తీసుకున్నాడు. అంతకు ముందుఅతనికి సొంతంగా కొన్ని గొర్రెలున్నాయి. తన గొర్రెలు, రాయితీ కిందవచ్చిన గొర్రెలను ప్రతి రోజు అడవికిమేపడానికితోలుకెళుతుండేవాడనిగ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అటు వ్యవసాయం చేసుకుంటు, ఇటు జీవాలను కాసుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తున్నాడు శ్రీను.ఈ క్రమంలో ఒక గొర్రె, జీవాల మంద నుంచి తప్పిపోయింది. ఆతప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ గురువారం ఉదయం చీకటితోనే మేళ్లమడుగు ప్రాంతానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులుశ్రీనును పట్టుకుని నక్సలైట్ పేరుతో కిరాతకంగా కాల్చి చంపారని వారుదుఃఖిస్తూ పేర్కొంటున్నారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, అమాయకుడైన శ్రీను నక్సలైట్ పేరుతో చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలనికుటుంబికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments