Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

దేవుని పేరుతో భూంఫట్

 

new

రూ.20 కోట్ల విలువైన భూమి కబ్జా
ఎండోమెంట్, మున్సిపల్ అనుమతులు
లేకుండా నిర్మాణం
కోర్టులో ఉన్న భూమిలో నిర్మాణం
చేస్తున్నారని పట్టాదారు ఆరోపణ

మన తెలంగాణ/తాండూరు : దేవుని పేరుతో తాండూరు పట్టణంలో రూ.20 కోట్ల విలువైన భూమిలో  ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.మున్సిపల్ నుంయి కానీ ఎండోమెంట్ నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా దేవాలయ అధికారులు, చైర్మన్ నిర్మాణం చేపట్టారు. దీంతో సదరు పట్టాదారు కోర్డును ఆశ్రించి స్టే తీసుకు వచ్చినా పనులు ఆపడం లేదు. అధికార పార్టీకి చెందిన చైర్మన్ పట్టాదారులను బెదిరించి కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఈ మేరకు బాధితులు మున్సిపల్  అధికారులకు ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణంలో వెలసిన శ్రీ బావిగ భద్రేశ్వర దేవాలయం పురాతనమైనది. ఈ దేవాలయాన్ని పుల్లమ్మ దొడ్డి కింద ఉన్న స్థలంలో నిర్మించారు.దేవాలయం నిర్మాణం కింద గతంలో మొత్తం 6,683 గజాల స్థలాన్ని పుల్లమ్మ దొడ్డిలో ఇచ్చారు. ఈ ప్రదేశంలో దేవాలయ నిర్మాణం , పక్కన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే డబ్బులను దేవాలయ కమిటీ ప్రతి సంవత్సరం నిర్వహించే భద్రేశ్వర జాతరకు ఖర్చు చేస్తున్నారు.అయితే భద్రేశ్వర దేవాలయం పక్కన బస్వణ్ణకట్ట ప్రాంతంలో ఉన్న 836 గజాల స్థలం కూడా భద్రేశ్వర దేవాయానికి చెందిందే అని ప్రస్తుత  దేవాలయ చైర్మన్ అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. దీంతో 836 గజాల స్థలం తమదేనని తాండూరు పట్టణానికి చెందిన కల్వ శంకర్ అతని భార్య కల్వ సుజాత కోర్టులో కేసు వేశారు. అది వారి పెద్దల ఆస్తి ఉన్నదని కల్వ శంకర్ తండ్రి కల్వ లక్ష్మయ్య,  కల్వ రాజయ్య,కల్వ రామయ్య,కల్వ సూర్యనారాయణ అన్నదములు కావడంతో తమ తండ్రికి అన్నదమ్ముల పంపకాలలో ఈ 836 గజాలు ఇచ్చారు.ఇందుకు సంబంధించి పత్రాలను మున్సిపల్‌కు ఎండోమెంట్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు.గతం ఇక్కడ నూనె మరను నిర్వహించే వారమని ప్రస్తుతం ఈ స్థలం తమదేనని వారు పేర్కొంటున్నారు.అయితే భద్రేశ్వర్ దేవాలయంకు చెందిన పుల్లమ్మ దొడ్డి ప్రదేశం 6,683 గజాలు మాత్రమే ఉందని అందులో తమ భూమి లేదని వారు పేర్కొంటున్నారు. 8-12-1990లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఈ 836 గజాల ప్రదేశంలో ఉన్న చుట్టు పక్కల వారికి ఇచ్చిన పట్టా సర్టిఫికెట్‌లలో సైతం తమ పేరు ఉందని వారు పేర్కొంటున్నారు.కేవలం చైర్మన్ లబ్దికోసం అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే నిర్మాణాన్ని ఆపాలని వారు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా భద్రేశ్వర్ దేవాలయం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని దుకాణాలను అద్దెకు ఇస్తామని చెప్పిన కిరాయిదారుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారు.ప్రతి దుకాణానికి రూ.15 నుండి రూ.25 లక్షల వరకు వసూళ్లు చేశారు.అద్దె పేరుతో సుమారు 80 సంవసత్సరాల అగ్రిమెంట్ ఇస్తామని ఇప్పటివరకు రూ.2 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.అయితే పట్టాదారు అయిన కల్వ శంకర్ తిరగబడటంతో అడ్వాన్స్ ఇచ్చిన కిరాయిదారులు ఆందోళన చెందుతున్నారు.మున్సిపల్ అధికారులు మాత్రం భద్రేశ్వర దేవాలయ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు.దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పనులను నిలిపివేశారు. దేవుని పేరుతో చైర్మన్ చేస్తున్న అక్రమ కట్టడాలపై కిరాయి దారులు మండిపడుతున్నారు.తమ అడ్వాన్స్‌లు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
836 గజాల భూమి దేవస్థానంకు చెందిందేః చైర్మన్ శెట్టి అమితానంద్
శ్రీభావిగ భద్రేశ్వర దేవస్థానంకు చెందిన 836 గజాల స్థలం దేవస్థానంకు చెందిందని ఆలయ చైర్మన్ శెట్టి అమితానంద్ తెలిపారు.ఈ స్థలం దేవస్థానంకు చెందిందని 2003లోనే కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే దేవాలయ,మజీబ్ లకు చెందిన స్థలం నిర్మాణం చేపట్టే సమయంలో మున్సిపల్ అనుమతులు తీసుకోలేదని అయితే తాము కూడా మున్సిపల్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.ఎండోమెంట్ కింద నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.ఇట్టి స్థలంలో ఎవరూ అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.

Comments

comments