Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

అంతరిక్షంలో మరో సౌరవ్యవస్థ

Sun-Image

అచ్చంగా మన సౌరవ్యవస్థను పోలిన మరో సౌర వ్యవస్థను నాసా గుర్తించింది. కెప్లర్ టెలీస్కోప్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సౌరవ్యవస్థ ఉన్నట్లు నాసా వెల్లడించింది. మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ  గ్రహాలు తిరుగుతున్నట్లుగానే , ఈ కొత్త సౌరవ్యవస్థలోనూ ఒక నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. తాజాగా గుర్తించిన సౌరవ్యవస్థలో మొత్తం 8 గ్రహాలున్నాయి. ఇందులో ఎక్కడా జీవరాశి మనుగడ సాధించడానికి అవకాశం లేదంటున్నారు. కొత్త సౌరవ్యవస్థలో కెప్లర్ 90బి గ్రహంలో రాళ్లు పర్వతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గ్రహం నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 14.4రోజులు పడుతుంది. అంటే భూమిమీద రెండు వారాల సమయం. మన భూమితో పోలిస్తే అక్కడ ఉష్ణోగ్రత చాలా అధికమని తెలిపారు.

Comments

comments