Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

జాతీయ రహదారులు నాగరికతకు చిహ్నాలు

motor

*వంతెనల నిర్మాణం కోసం భారీగా నిధులు
*రవాణా సదుపాయం కోసం కృషి
*కొత్త రాష్ట్రంలో 3వేల కి.మీ రోడ్లు
*వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/బాన్సువాడ: జాతీయ రహదారులు నాగరికతకు చిహ్నాలుగా నిలుస్తాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం గతం లో కంటే మరో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూ ర్‌లో మంజీరా నదిపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. 1300 మీటర్ల పొడువున ఈ వంతెన నిర్మాణం జరుగుతుందని తెలిపా రు. 53 పిల్లర్లతో పటిష్టమైన వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 43 పిల్లర్లు పూర్తి కాగా మిగతా పిల్లర్లను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గుత్తేదారును మంత్రి ఆదేశించారు. వంతెన నిర్మాణం పూర్తయితే బీర్కూర్ నుండి మద్నూర్, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలకు ప్రయాణంలో దూర వ్యత్యాసం తగ్గుతుందని తెలిపారు. ఈ వంతెన నిర్మాణం కోసం రూ.45 కోట్ల నిధులను వెచ్చించడం జరు గుతుందని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష లో మంత్రి మాట్లాడుతూ, బీర్కూర్ నుండి మద్నూర్ వరకు రూ.28 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుండి భూమిని సేకరిస్తామని చెప్పారు. రోడ్డు ఏర్పాటు అయితే వారికి ప్రయాణానికి సులభంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్రం వచ్చేనాటికి కేవలం 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, తెలంగాణ ప్రభుత్వంలో గత మూడేళ్లలో 3000 కిలో మీటర్ల రోడ్డుకు అనుమతులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల కోసం 11,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇవే కాకుండా  పంచాయితీ రాజ్ శాఖ నుండి చేపడుతున్న రోడ్లకు మరో 5500 కోట్లు ను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రవాణా సౌకర్యాల మెదుగుదలతో అమెరికా , యూరఫ్ లోని దేశాలు అభివృద్ది చెందాయని,రవాణా సౌకర్యాలు బాగున్న అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సీఎం అలోచనగా ఉందన్నారు. రహదారుల ఏర్పాటుతో నూతన పరిశ్రమలు ఏర్పాటు కాగా వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
జాతీయ రహదారుల విస్తరణలో బాగంగా హైదరాబాద్ నుండి మెదక్-బాన్సు వాడ -బోధన్-బాసర-బైంసా వరకు పోర్‌లైన్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. మొదటి విడుతలో భాగంగా 600 కోట్లతో హైదరాబాద్ నుండి మెదక్ వరకు 90 కిలో మీటర్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని, రెండవ విడుతలో మెదక్ నుండి రుద్రూర్ వరకు మరో 600 కోట్లతో 90 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్ ఇ మధుసూదన్‌రెడ్డి, ఈఈ అంజయ్య, డిప్యూటీ ఇఇ మోహన్, ఎఇ బాను, బాన్సువాడ ఆర్‌డిఓ రాజేశ్వర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎఎంసీ చైర్మెన్ పెర్క శ్రీనివాస్, మాజీ జడ్పిటిసీ ద్రోణవల్లి సతీష్, ద్రోణవ ల్లి అశోక్,బస్వరాజ్, ఎంపిడీఓ భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.

Comments

comments