Search
Monday 11 December 2017
  • :
  • :

రాష్ట్రాభివృద్ధిని ఎవరూ ఆపలేరు

 

mediaకాంగ్రెస్‌ది రెండు నాల్కల ధోరణి
అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఆ పార్టీ వారే
కాంగ్రెస్‌పై భగ్గుమన్న మంత్రులు

మనతెలంగాణ/పరిగి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా ఆపడం ఎవరితరం కాదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ పరిగిలో అల్పాహారం విందు స్వీకరించారు. పరిగి పశుసంవర్థకశాఖ ట్రైనింగ్ సెంటర్‌లో అల్పాహారం స్వీరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల సమ్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారాం చేస్తూ వస్తున్నామన్నారు. ముఖ్యంగా రైతుల కోసం మునుపెన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా మిషన్ కాకతీయ కింద కొన్నేళ్లుగా కుంటలు, చెరువుల్లో పేరుకుపోయిన పూడిక తీసి కట్ల, అలుగు తదితరవాటిని బాగు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. అంతేకాకుండా వ్యవసాయనికి కూడా 24 గంటల సరఫరా చేసే దిశగా కృషి చేస్తున్నారన్నారు. ముందుస్తుగా ఎరువులు, విత్తనాలు, సరఫరా చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నామాన్నరు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అందుకు రాష్ట్రాన్ని యూనిట్‌గా చేసి అభివృద్దికి శ్రీకారం చుడుతున్నారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. వీటికి మందులు, మొబైల్ అంబులెన్స్‌లు ఇచ్చామన్నారు. ఈ గొర్రెలు తినేందుకు పశుగ్రాసం కూడా 75 శాతం సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. మిషన్‌భగీరథ కూడా త్వరలో పూర్తై గ్రామగ్రామాన కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇలాంటి శాశ్వత పరిష్కారాల మార్గాలను వెతికి అభివృద్ధి చేస్తుంటే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్తాపితం కావడం ఖాయమన్నారు.
కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయండి
పరిగిలో ఈ సారి తప్పని సరిగా కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నాయకత్వాన్ని గెలిపించుకుతీరుతామన్నారు. ప్రసుత్త ఎమ్మెల్యే సొమ్మొకరిది సోకొకరిదిగా వ్యవహరిస్తున్నారంటూ తప్పుపట్టారు. మన ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి చేస్తూ తానే సొంతంగా చేస్తున్నట్లు గొప్పులు చెప్పుకుంటున్నారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ముఖ్యంగా పాలమూరు-, రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ మార్చి పనులు చేద్దామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కోర్టులో కేసు వేశారంటూ తెలియజేశారు. ఓ ఎమ్మెల్యే ప్రాజెక్టు కావాలంటుంటే.. మరో ఎమ్మెల్యే ప్రాజెక్టు పనులు జరగవద్దంటూ కోర్టుకు వెళ్లి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్నారు. పరిగికి పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్టు రాకపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రధాన కారణమని తెలియజేశారు. సిఎం కేసీఆర్ పాలకవవర్గంలో ఉన్న ప్రతిపక్షామ, మిత్రపక్షమా అన్న తార తమ్యాలు లేకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టే పరిగి నియోజకవర్గం కూడా అభివృద్ది చెందుతుందన్నారు. అభివృద్ది చెందడం చాలా సంతోషమని మరింత అభివృద్దిని కోరుకుంటున్నామన్నారు. ఇందుకు తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడేతున్న అభివృద్ది చేసి స్వయంగా మోడీనే మెచ్చుకున్నారన్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేక తెలంగాణ పార్టీ సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. మహబూబ్‌నగర్‌లో డబుల్ బెడ్ గదులు నిర్మిస్తుంటే అ అసైన్డ్ భూముల రైతులతో కేసు వేయించి అడ్డుకున్నారన్నారు. అదే భూముల్లో ఇదే కాంగ్రెస్ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక మేం అభివృద్ది చేస్తుంటే జీర్ణించుకోలేక రైతులను ఉసి గొల్పి ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్న నీచ సంసృతి ఈ కాంగ్రెస్‌ది అని తెలియజేశారు. ప్రాజెక్టులను చేపడతామంటూ కాంగ్రెస్ హాయంలో ఎక్సెస్ డబ్బులు తీసుకొని దోచుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కగా అది చాలదంటూ ప్రాజెక్టులు నిర్మిస్తున్నమా పార్టీపై నోరుపారేసుకోవడం తగదన్నారు. అభివృద్దిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాలకు వస్తే తన్ని తరుమాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే విద్య,వైద్య, పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రోడ్లు విషయానికి వస్తే కొత్తకొత్త వైవే రోడ్లు కూడా వేయిస్తున్నామన్నారు.ఇదంతా చూస్తున్న ప్రతిపక్ష నాయకులు తమ పార్టీ తెలంగాణాలో గల్లంతవుతుందనే ఉద్దేశంతోనే ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నార్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువ నాయకులు కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ రొయ్యల ఆంజనేయులు, పరిగి సర్పంచ్ అంతిగారి విజయమాల, పరిగి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శివన్నోళ్ల భాస్కర్, నాయకులు ఎస్పీ బాబయ్య, అంతిగారి సురేందర్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బేతు ప్రవీణ్‌కుమర్‌రెడ్డి, అశోకవర్ధన్‌రెడ్డి, రవి, మునీర్, బషీర్ రులు పాల్గొన్నారు.

Comments

comments