Search
Sunday 25 February 2018
  • :
  • :

త్వరలో 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

ganta

హైదరాబాద్: తర్వలోనే గ్రూప్-2 నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని టిఎస్‌పిఎస్సి ఛైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. కోర్టు వివాదంలో ఉన్న గ్రూప్-2 పక్రియ, రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 29,644 ఉద్యోగాలకు నోటిఫికేసన్లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. వీటిలో 26 వేల ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. రెండున్నరేళ్లలో 175 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, ఇప్పటి వరకు టిఎస్‌పిఎస్సి నిర్వహించిన పరీక్షలకు 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు వివరించారు. తక్కువ సమయంలోనే 30వేల ఉద్యోగాలను టిఎస్‌పిఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

Comments

comments