Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి

tv

ఎమ్మెల్యే వేముల వీరేశం
మనతెలంగాణ/రామన్నపేట : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేటను ఆరుబయట మల విసర్జన లేని (ఓడీఎఫ్) మండలంగా ప్రకటించుటకు రూపకల్పన నిమిత్తం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.స్వచ్చభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు , అధికారులు తమ సామాజిక బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఉపా ధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పని చేసి జనవరి 26లోగా లక్షాన్ని పూర్తి చేయాలని, రామన్నపేట ,వెల్లంకి, సిరిపురం, మునిపంపుల, బోగారం, నీర్నెముల,కక్కిరేణి గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనుల జాప్యాన్ని నివారించాలని తెలిపారు. పనులు త్వరగా పూర్తయ్యే లా మండల స్థాయి అధికారులకు గ్రామాల వారీగా బాధ్యతను కే టాయించాలనిఎంపిడిఒకు సూచి ంచారు. ఎంపిపి కక్కిరేణి ఎల్లమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పిటిసి జినుకల వసం త, ఎంపిడిఒ కె.జానకిరెడ్డి, ఎపి వో ఈశ్వర్, సర్పంచ్‌లు ఎన్.మొ గు లయ్య, గంగుల రాజిరెడ్డి,జెట్టి బాలమల్లయ్య, పి.మల్లేశం, కొండ బుచ్చిబాబు, పూస బాల నర్సింహా, ఎంపిటిసి ఎ.మధుబాబు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments