Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

25న వనపర్తిలో నాగం తిరుపతిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో

tournamentసినీతారలతో క్రికెట్ టోర్నమెంట్ 

* విజేతలకు లక్షరూపాయల నగదు బహుమతి
* హాజరుకానున్న ట్రస్ట్ చైర్మన్, కలెక్టర్, ఎస్‌పి..
* ఏర్పాట్లను పరిశీలించిన
సినీ ఆర్‌టిస్ట్ లోహిత్‌కుమార్..
* స్నేహ పూర్వక ఉత్కంఠ పోరుకు..
వేదిక కానున్న వనపర్తి పాలిటెక్నిక్ మైదానం..

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ఈనెల 25న వనపర్తిలో సినీ తారల సందడి తళుక్కుమననుంది. నాగం తిరుపతిరెడ్డి ట్రస్ట్ (ఎన్టీఆర్) ఆధ్వ ర్యంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సినీ కళాకారులు,ఒక జట్టు గా మరియు వనపర్తి నియోజక వర్గంలోని గ్రామీణ క్రికెట్ క్రీడాకారు లు మరో జట్టుగా ఏర్పడి పోటీల్లో పాల్గొననున్నారు. ఈనెల 25న ఉద యం 12.00 గంటలకు ట్రస్ట్ చైర్మన్ నాగం తిరుపతి రెడ్డి కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్‌పి.రోహిణిప్రియదర్శినిలు ముఖ్య అతిథులుగా హాజరై మ్యాచ్‌ను ప్రారంభిస్తారని క్రీడల ఇంచార్జీ లోహిత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ కళాకారుల జట్టుకు తెలుగు థండర్స్ ,వనపర్తి జట్టుకు వనపర్తి వ్యా రియర్స్ జట్లుగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈపోటీల్లో గెలుపొందిన జట్టుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష రూపాయల నగదు బహు మతి అందజేయనున్నారు.
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే క్రీడల నిర్వహణ..
ట్రస్ట్ చైర్మన్ నాగం తిరుపతి రెడ్డి…
వనపర్తి నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న గ్రామీణ క్రీడాకా రుల ప్రతిభను వెలికి తీసి వారిని జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్షంతోనే ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ నాగం తిరుపతి రెడ్డి తెలిపారు. ప్రతిభ ఉన్న ప్రతి క్రీడాకారునికి ,విద్యార్థికి పేద రికం అడ్డుకాకూడదని ఆయన పేర్కొన్నారు.
సినీ కళాకారులతో .. సాంస్కృతిక కార్యక్రమాలు..
క్రీడల అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సినీ కళాకారుల తో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని క్రీడల ఇంఛార్జ్జ్ లోహిత్‌కుమార్ తెలిపారు. అదేరోజు నాగం తిరుపతి రెడ్డి జ న్మదినం సందర్భంగా క్రీడాకారులతో కలిసి నాగం కేక్ కట్ చేస్తారని ఆ యన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగం యువసేన సభ్యులు పర్వతా లు,నరేష్ గౌడ్, ఆదిత్య, శివకుమార్ ,నందకిషోర్, భాను,శివప్రసాద్ గౌడ్, వెంకటేష్,రా ము,నరేందర్ ,మధు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments