Search
Sunday 21 January 2018
  • :
  • :

ఎంఎల్‌ఎ కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

MLA-Car-collision-Bike

జనగామ: ఎంఎల్‌ఎ కారు ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం వెలిశాల వద్ద ఆదివారం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంఎల్‌ఎ కోరం కనకయ్య ఇన్నోవా కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యాదయ్య అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

One Dead after MLA Car Collision with Bike in Jangaon.

Comments

comments