Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం ఒకరు మృతి

lorryమన తెలంగాణ/కీసరః ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం తుక్కుగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్‌కు వెళుతున్న లారీని వెనకాల నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ సంతోష్ (27) తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందగా! కళ్యాణ్, నాగరాజులకు తీవ్ర గాయాలైనాయి. వీరిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments