Search
Friday 20 April 2018
  • :
  • :

వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి

collectorమనతెలంగాణ/మెదక్ ప్రతినిధి:ప్రతి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలకు మండల స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ భారతిహోళ్ళికేరి విద్యా శాఖాధికారిని ఆదేశించారు. బుధవారము కలె క్టరేటులోని సమావేశ మందిరంలో జిల్లాలోని మండలాల విద్యాధికా రులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. జిల్లా లోని అన్ని ప్రభు త్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధి చేందుకు ఇప్పటినుండే ప్రత్యేక తరగతులు నిర్వహించా లని, అంతేకా కుండా ప్రతివారం సబ్జెక్టుల వారిగా క్వీజ్ పోటీలను నిర్వ హించాలని జిల్లావిద్యాధికారినీఆదే శించా రు. రాష్ట్రంలో ఏ స్థానంలో ఉన్నామనేది ప్రాముఖ్యం కాద ని, మన విద్యా ర్థులకు ఎంత మేర సామర్ధాలను నేర్పించా మనేది ముఖ్య మన్నారు. వందేమాతరం పౌండే షన్ వారు నిర్వహించిన బెస్‌లైన్ సర్వేలో సగటు మార్కులు తక్కువగా ఉన్నాయని, వారు నిర్వహించిన సర్వే ఆధారంగా విద్యార్థుల ప్రతిభ, సామార్ధాలను పెంపో ందించేం దుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఇప్పటివరకు సర్వే రిపోర్టులు అంజేయని ఎంఇవోలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం చేసే పనిలో ఇంత అలసత్వం వహిస్తే ఎలా అని ప్రశ్నించా రు. ఎంజిఎంఎల్ కార్యక్ర మం జిల్లాలో విజయవంతం అయ్యిందని, వచ్చే సంవత్సరం మరోక వంద పాఠశాలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఆరోగ్య భవిత కార్యక్ర మం ద్వారా ఇప్పటివరకు 42000 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని,  ఈ సమావేశంలో జిల్లా విద్యశాఖాధికారినీ విజయ కుమారి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, నోడల్ అధికారి మధు మోహన్, మండలాల ఎంఇవోలు   పాల్గొన్నారు.

Comments

comments