Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

లక్ష మంది సభ్యుల ‘జిందగీ ఇమేజెస్’

దూరాలను కలుపుతున్న సోషల్ మీడియా బంధాలు
ఆత్మీయ బంధాలను ఏకం చేస్తున్న ఫేస్‌బుక్ గ్రూప్
గ్రామీణ, గల్ఫ్ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపెడుతున్న చిత్రాలు

                    Zindagi-Images

మన తెలంగాణ/సిటీబ్యూరో: లక్ష మందీ బలగంతో జిందగీ ఇమేజెస్ గ్రూపు దూసుకుపోతుంది. మనిషి జీవితాల్లో ఉన్న విభిన్నమైన కోణాలను ఆవిష్కరిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఫేస్‌బుక్ వేదికగా కొనసాగుతున్న ఈ ఉమ్మడి కుటుంబం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. సామాజిక చైతన్యం పెంపోదించే దిశగా జిందగీ ఇమేజెస్ ఫేస్‌బుక్ గ్రూప్ ప్రయత్నం చేస్తోంది. 2014 ఆగస్టు 17 నుంచి ఫిల్మ్‌మేకర్ చేగొండి చంద్రశేఖర్(చేగో) ఆధ్వర్యంలో ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ గ్రూపు నేడు లక్ష మంది సభ్యులతో రూపాంతం చెందింది. ప్రతి నెల వెయ్యి మంది వరకు ఈ గ్రూపులో కొత్త సభ్యులుగా చేరుతున్నారు. వీరిలో ఎక్కువగా దుబాయి, సౌదీ అరేబియా, ఖతర్,అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటున్న తెలుగువాళ్లు సైతం ఉన్నారు.

                 Village

గ్రామీణ జీవితంలో పాటు గల్ఫ్ జీవన చిత్రం వరకు అన్ని రకాల ఫోటోలు జిందగీ ఇమేజెస్‌లో మనకు దర్శనమిస్తాయి. ప్రధాన జిందగీ ఇమేజెస్‌లో పోస్టుల్లో ఎక్కువగా సామాజికి అంశాలకు చెందిన చిత్రాలే కనిపిస్తాయి. అందులో పల్లె, పట్నం తో పాటు ఇతర దేశాల్లో జరుగుతున్న ఆరాచకాలు, ప్రజలకు ఉపయోగపడే చిత్రాలను పోస్టు చేయవచ్చు. చివరకు చెత్తకుండీ అయితే సరే అందులో కొత్తదనం ఉండే సభ్యులు పోస్టు చేయవచ్చు. సామాజిక కార్యక్రమాలు జందగీ ఇమేజెస్ గ్రూప్ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. గత మూడేళ్లలో సభ్యులు వివిధ రకాల సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో చాలా రకాల మనుషులు ఉంటారు. వారు వారు తమ తమ జీవితాలను ప్రజెంట్ చేసే తీరులో జిందగీ సౌందర్యం కళ్లకు కడుతుంది. ఎన్నో కొత్త జీవితాలు ప్రతి రోజు పరిచయమవుతుంటాయి. ఇందులో రైటర్లు, డైరెక్టర్లు, రైతులు, బిజినెస్‌మెన్లు, సామాజిక కార్యకర్తలు, ఇలా ఎంతో మంది వ్యక్తిగత చాంధసంతో అస్కారం లేకుండా చక్కగా కలిసిపోయి ఫేస్‌బుక్‌లో ఒక పెద్ద గ్రూపుగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణం, నగరం, ప్రకృతి, మానవసంబంధాలు, గల్ఫ్ బాధితులు అవేదనలు ఇలా ఉన్నో ఛాయ చిత్రాలు ఇందులో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా సౌదీ అరేబియా,దుబాయి దేశాలలో ఉపాధి కోసం వలస పోయిన కార్మికుల కష్టాలు జిందగీ ఇమేజెస్‌లో దర్శమిస్తాయి. దీంతో గల్ప్ కార్మికులకు అండగా జిందగీ ఇమేజెస్ పోరాటం చేస్తోంది. ప్రజాప్రతినిధుల సహయంలో గల్ఫ్‌లో చిక్కుపోయి ఇబ్బంది పడుతున్న ఎందరో కార్మికులకు కూడ విడిపించింది. అలాగే చేనేత కార్మికులకు గ్రూప్ సభ్యులు అండగా ఉంటూ చేనేత వస్త్రాలను ధరిస్తున్నారు.

ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదు : జిందగీ ఇమేజెస్ గ్రూప్ ఇంత పెద్దగా విజయం సాధిస్తుందని అనుకోలేదు. ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు. ఒ క పెద్ద మూమెంట్ అవడం ఖాయం. ఉగాండా దేశం నుంచి కూడ కొందరు సభ్యులు ఫోటోలు స్పెషల్‌గా జిందగీ కోసం పంపిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది.
చాలా రిలీఫ్‌గా ఉంటుంది

నేను గ్రామీణ వాతావరణంలో నుంచి వచ్చాను. పల్లెలు అంటే ఇష్టం కానీ వెళ్లడం కుదరదు. జిందగీ గ్రూప్‌లో పల్లెల లైఫ్‌స్టైల్ ఫోటో చూస్తే అక్కడి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నప్పుడు జిందగీ గ్రూప్‌లోకి చూస్తే చాల రిలీఫ్‌గా ఉంటుంది.

Chandra-Shekhar
– చేగొండి చంద్రశేఖర్ (గ్రూప్ వ్యవస్థాపకుడు)

Comments

comments