Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

కేంద్రంలో 4లక్షల కొలువులు

Jitendra-Singh

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో పాటు కొందరు ఉద్యోగులు తమ వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే ఉద్యోగాలు వదిలేయడంతో ఉద్యోగుల కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక లేఖలో వెల్లడించారు. ఆయన లోక్‌సభకు సమర్పించిన లేఖలో … 2016 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ పలు విభాగాల్లో 36,33,935 పోస్టులు ఉండగా, ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేగాక త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

Over 4 lakh posts vacant in central government departments.

Comments

comments