Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

జిల్లాలో 65 శాతానికి పైగా భూ ప్రక్షాళన : కలెక్టర్ దివ్య

madam2మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : జిల్లాలో భూప్రక్షాళన పనులు పూర్తి అయిన గ్రామాలలో ఆర్‌ఓఆర్ 1 బి ని రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టర్ దివ్య తన ఛాంబర్‌లో జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవరావులతో కలిసి తహసీల్దార్లతో భూప్రక్షాళన కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి 65 శాతానికి పైగా భూప్రక్షాళన కార్యక్రమం జరిగిందన్నారు. ఇంకా మిగిలిపోయిన పనులు త్వరితగతిని చేపట్టాలని ఆదేశించారు. భూసర్వే పూర్తి అయిన గ్రామాలలో వారంలోగా పహణీలలో భూ వివరాలను పొందుపర్చాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం ఎకరాకు రెండు దఫాలలో 4 వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నందున రికార్డుల్లో ఖచ్చితమైన వివరాలను క్రోడీకరించాలని ఆమె తెలిపారు.

Comments

comments