Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ఏళ్ల తరబడి అధికారుల తిష్ట అవినీతికి పరాకాష్ట

TEMPLE

*పదోన్నతులు వద్దంటున్న వైనం
*పై అధికారులు, అమాత్యుల అండదండలు

మనతెలంగాణ/వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బదిలీలు కాకుండా పాతుకుపోయిన ఉద్యోగులే అవినీతికి మూల విరాట్టుగా కొనసాగుతున్నా రు.రాజకీయ నాయకులు,ఉన్నతాధికారుల అండతో ఉ ద్యోగులు అక్రమార్జనకు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్న ట్లు స్పష్టమవుతుంది. తమకు నమ్మిన బంటులుగా ఉన్నవారికి తాము పని చస్తున్న విభాగంలో ఉద్యోగ వసతి కల్పి స్తూ తద్వారా అక్రమార్జనను కొనసాగిస్తూ సంవత్సరాల తరబడి తమ గుట్టు రట్టు కాకుండా చూసుకుంటున్నార న్నా అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి.నిన్నటి ఎసిబి దా డులలో పట్టుబడిన ఆలయ సూపరింటెండెంట్ నామాల రాజేందర్ లడ్డూ విభాగంలో ఏడు ఏళ్లుగా విధులు నిర్వహిస్తుండడం దీనికి బలం చేకూర్చేదిగా ఉంది. రాజేందరే స్వ యంగా శానిటేషనకు సంబంధించి ఎటువంటి విద్యార్హత లు లేని ఒక వ్యక్తి నుంచి కొంత మొత్తం తీసుకోని నియామకపు ఉత్తర్వులు ఇచ్చారని తెలుస్తుంది. శానిటేషన్ విభాగంలోనే ఒక ఉన్నత ఉద్యోగి ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనంలో సగభాగాన్ని మాత్రమే ఇస్తూ మిగతా సగం అ ధికారులతో కలిసి పంచుకు న్నట్లుగా తెలుస్తుంది. ఈ విష యం తెలిసిన కార్మికులు పెద్దఎత్తున నిరసన తెలపడంతో పూర్తి వేతనం అందిస్తున్నారు. గదుల నిర్వహణలో ఓ ఉ ద్యోగి ఆరు ఏళ్లు, గ్యాస్ గోదాంలో ఇద్దరు ఉద్యోగులు ఏడు ఏళ్లు, ఎస్టాబ్లి ష్‌మెంట్‌లో కొందరు ఉద్యోగులు ఐదు ఏళ్లు , పూజా స్టోర్‌లో ఓ ఉద్యోగి ఎనిమిది ఏళ్లు ఇలా చాలా వి భాగాల్లో నాలుగు ఏళ్లు కంటే ఎక్కువగా ఒకే స్థానంలో ప ని చేస్తున్నారు. వీరంతా ఉన్నత హోదాల్లో ఉండడం గమని ంచవలసిన విషయం. అవినీతి రుచిమరిగిన మరికొందరు ఉద్యోగులు పదోన్నతి పొందినా దేవాలయాన్ని వదిలి వెళ్లడానికి విముఖత వ్యక్తపరుస్తూ గత హోదాలోనే కొనసాగడం విడ్డూరం.దేవాలయంలో అకౌంట్స్ విభాగంలో ఓ ఉద్యోగి 9–10 ఏళ్లుగా కొనసాగుతుండగా పదోన్నతిపై బ దిలీ చేశారు. అయినా తన పరపతితో, నాయకుల అండతో అదే స్థానంలో కొనసాగుతున్నారు. త్వరలో వేములవాడ ఆలయాన్ని వందలాది కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించి దేశంలోని అగ్ర దేవాలయాల సాటిగా తీర్చిద్దిదనున్న సమయంలో ఇటువంటి అవినీతి తిమింగిలాల మూ లంగా అభివృద్ధి నిధుల కైంకర్యాని మార్గం మరింత సుగమమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజరాజేశ్వరుని దేవాలయంలో ఇలా పెరుగుతున్న అవినీతి సగటు భక్తునిలోని విశ్వాసాన్ని హరించి వేస్తూ, భక్తులలో ఆధ్యాత్మిక చింతన తగ్గటానికి కారణమవుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాల ప్రక్షాళనపై వెంటనే దృష్టి సారించి తగు చర్యలు చేపట్టి భక్తులలో దేవాలయాలపై ఉన్న విశ్వాసాన్ని పెంపొందించకపోతే అభివృద్ధి ప నులు నాసిరకంగా మారక తప్పదంటున్నారు.

Comments

comments