Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అక్షయ్ ‘ప్యాడ్‌మ్యాన్‌’ ట్రైలర్‌…

PADMAN

బాలీవుడ్‌ టాప్ హీరో అక్షయ్‌ కుమార్‌, సోనమ్‌ కపూర్‌, రాధికా ఆప్టే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్‌’. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన  చిత్రాలతో అలరిస్తున్న అక్షయ్ ‘ప్యాడ్‌మ్యాన్‌’ కూడా అదే తరహా కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అరుణాచలం మురుగనాథమ్‌ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. తమిళనాడుకి చెందిన అరుణాచలం ఓ సామాజికవేత్త. సమాజంలో మహిళలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ఆయన శానిటరీ ప్యాడ్లు తయారుచేసి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేసిన విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ లో ‘అమెరికాలో సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌ ఉంటే మన ఇండియాలో ప్యాడ్‌మ్యాన్‌ ఉన్నాడు’ అనే  డైలాగ్‌ బాగుంది. ఆర్‌. బాల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2018 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

PADMAN Official Trailer Released.

Comments

comments