Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గట్టి పిండమే..!!(షాకింగ్ వీడియో)

Passing-driver-saves-boy-th

బీజింగ్‌:  చైనాలోని సుజౌ నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైవేపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఇంతలో రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి. దాంతో ఓ వాహనంలోంచి ఏడేళ్ల బాలుడు గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డు మధ్యలో పడ్డాడు. రోడ్డుపై కొంతదూరం రాసుకుపోయాడు కూడా. ఇది చూసినవారు ఆ బాలుడు తీవ్రంగా గాయపడడమో లేదా చనిపోవడమో జరిగి ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఆ బుడతడు. వెంటనే వెనుక నుంచి వచ్చిన మరో వాహనదారుడు బాలుడిని పైకి ఎత్తి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకుంది. భూమి మీద నూకలు ఉండాలే గానీ ఎలాంటి ప్రమాదాలు ఏమీ చేయాలేవని ఈ బుడతడు మరోసారి నిరూపించాడన్నమాట.

Comments

comments