Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆ పాఠాలతో జనసేన నిర్మించా: పవన్

pawan kalyan press meet on ap special status

ఆంధ్రప్రదేశ్: ఆవేశంతో, ఆకతాయితనంతో తాను రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. దెబ్బలు తినడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు వందల కోట్లు ఇచ్చే వాళ్లు లేరని… ఇచ్చినా తీసుకోనని అన్నారు. పిఆర్ పిలో పదవి ఇవ్వలేదని పరకాల ప్రభాకర్ తిట్టారని, చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల ప్రభాకర్ తిట్టేసి వెళ్లిపోయిన మౌనంగా ఉన్నారని, ఆ సమయంలో తాను ఉంటే సందర్భం ఇంకోలా ఉండేదని మండిపడ్డారు. పరకాల ప్రభాకర్‌లా కమిట్‌మెంట్ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదన్నారు.

పరకాల ప్రభాకర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తన సతీమణిని కేంద్రకేబినెట్లో కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.  ప్రజారాజ్యంపై పడగ విప్పిన పరకాల.. ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదని మండిపడ్డారు. ప్రజారాజ్యంలో నిస్వార్థపరులు లేక పార్టీ నష్టపోయిందని, లేకుంటే చిరంజీవి ఇప్పుడు సిఎంగా ఉండేవారని తెలిపారు. ప్రత్యేక హోదాపై మాట్లాడడానికి తాను చాలా చిన్న వాణ్ణి అని, తన కంటే అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయించడమే రాజకీయమని, ప్రజారాజ్యం పార్టీలో నేర్చుకున్న పాఠాలతో జనసేన నిర్మించానని తెలిపారు.  అందుకే పార్టీ నిర్మాణానికి దశాబ్ద కాలం పట్టిందన్నారు. ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయొచ్చన్నారు.  రాజకీయం అంటే మంత్రులు, ఎంఎల్ఎలు పిల్లలు కాదని, కులాలను గౌరవిస్తాను.. కానీ కులాలను వెనకేసుకరాను అని  ఇదే జనసేన సిద్ధాంతమని చెప్పారు.

Comments

comments