Search
Friday 20 April 2018
  • :
  • :

పోలవరంపై నిజాలు దాయొద్దు: పవన్

                    Pawan Kalyan (23)

ఆంధ్రప్రదేశ్: పోలవరం ప్రాజెక్టును ఎన్నికలకు వాడుకోవద్దని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సూచించారు. పోలవరం సందర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ…. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని, పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాటం చేస్తానని వివరించారు. సెక్రటేరియేట్ కట్టలేని వాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని దుయ్యబట్టారు. ఎపి ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. ఎపి ప్రభుత్వం నిజాలు దాస్తున్న కొద్దీ తనకు సందేహాలోస్తున్నాయని చెప్పారు.  పవన్ వ్యాఖ్యలతో ఎపి ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

Comments

comments