Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

పెండింగ్ ఉపకార వేతనాలను మంజూరు చేయాలి

PH

తొర్రూరు: పెండింగ్‌లో ఉన్నటువంటి విద్యార్థుల ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు తొట్టి హరీష్ అన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో పెండింగ్ ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఆర్‌డిఒ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్‌డిఒ క్రిష్ణవేణికి వినతిప్రతం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం పట్ల మొండి వైఖరి అవలంభిస్తున్నదని, గత సంవత్సరం నుండి విద్యార్థుల ఉపకార వేతనాలు, రీయంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్మారపు సందీప్, వెంకన్న, కుమార్, ప్రవీన్, దివ్య, స్నేహ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments