Search
Monday 11 December 2017
  • :
  • :

పింఛన్… టెన్షన్

pention

మన తెలంగాణ/బాన్సువాడ: ఆసరా పింఛన్లు లబ్ధిదారులను అవస్థ లకు గురి చేస్తున్నాయి. నెల రోజులపాటు పైకం కోసం ఎదురు చూస్తున్న వారికి సాంకేతిక కారణాలు ఇబ్బందుల పాలు చేస్తు న్నాయి. పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే కనీసం ఆరుగంటల పాటు క్యూలైన్లో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పడిగాపులు కాసి పైకం తీసుకునే సమయంలో వేలి ముద్రలు పడకపోవడం, సిగ్నల్ లేని కారణాలు తెరపైకి వస్తుండటంతో లబ్ధిదారులు బిక్కమోహమేస్తున్నారు. వేలి ముద్రలు పడనిదే పింఛన్ డబ్బులను అందించేది లేదని అధికారులు తేల్చి చెబు తుండటంతో వృద్ధులు, వికలాంగులు నానా యాతనలు పడాల్సి వస్తోంది. పైకం ఇచ్చేంత వరకు కదిలేది లేదని లబ్ధి దారులు రోడ్డు పైకి వచ్చే పరిస్థితి దాపురించింది.అధికారులతో వాగ్వివాదాలతో పైకం తీసుకునే దుస్థితి నెలకొందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఆసరా పింఛన్ల ప్రక్రి యలో సాంకేతిక కారణాలను పక్కన బెట్టాలని, లబ్ధిదారుల కార్డులను చూసి పైకం అందించే ఏర్పాట్లు చేయాలని సిఐటియు నాయకుడు రవీ ందర్ అధికారులను కోరారు. రెండు రోజుల క్రితం బాన్సువాడ పోస్టా ఫీస్ ముందు వృద్ధులు, వికలాంగులు ఆందోళనకు దిగారు.
కార్యాలయ ప్రాంగణంలో గగ్గోలు పెట్టారు. రోడ్డెక్కి పైకం అందించాల్సి ందేనంటూ గోలగోల చేశారు. ఆసరా పింఛన్ల సమస్య అధికారుల వద్ద కు వెళ్లినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. అసలు కారణమేమిటంటే బ్యాంకుల్లో కరెన్సీ అందుబాటులో లేక పోవడమే. కాని నెల రోజుల పాటు ఎదురు తెన్నులు కాచి పైకం వస్తే జీవనం కోసం నిత్యవసర సరకులను కొనుగోలు చేసుకుందామన్న వారి ఆశలపై అధికారులు నానా సాకులు చెబుతూ నీళ్లు చల్లుతున్నారు. జిల్లాలో ప్రతీ చోట ఇదే సమస్య ఏర్పడుతోంది. ఆసరా పించన్లలో లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా పంపిణీ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సైతం అధికా రులను ఆదేశించిన మార్పు కనిపించడం లేదు. పోస్టాఫీ సుల్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా వేలిముద్రల సమస్య తీవ్ర రూపం దాల్చింది. పించన్ కోసం వెళ్లిన వారికి పలు సమస్యలు ఏర్పడటంతో నిరాశతో తిరుగుముఖం పడుతు న్నారు. పల్లె ప్రాంతాలలో సిగ్నల్స్ లేక పోవడం వల్ల కూడా పైకాన్ని అందించలేక పోతున్నారు. సాంకేతిక కారణాలు ఓ ఎత్తైతే మరో పక్క అధికారులు కూడా లబ్ధిదారుల పట్ల సౌమ్యమనంగా మెదలలేకపోతున్నారు.
ఆందోళనలో ఉంటున్న వారిని మరింత రెచ్చగొడుతూ వారి ఆగ్రహానికి గురి చేస్తున్నారు. జిల్లాలో పించన్ల వివారిలివే… ఆసరా పింఛన్లు 1,14,797, వృద్ధాప్య పింఛన్లు 48, 479, వికలాంగులు 17,163, వితంతు 46,934, చేనేత పింఛన్లు 425, గీత కార్మికులు 662, హెచ్‌ఐవి 934, బీడీ కార్మికులు 28,715 పింఛన్లను ప్రతినెలా లబ్ధిదా రులకు అందిస్తున్నారు.

Comments

comments