Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

వ్యక్తి దారుణ హత్య

RAVI

మహబూబాబాద్: కురవి మండలం బలపాల శివారులోని లింగ్యా తండాలో బానోత్ రవి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. బానోత్ రవికి ఇద్దరు భార్యలు ఉన్నారు. కొంతకాలంగా రవి రెండో భార్యకు దూరంగా ఉంటున్నాడు. మొదటి భార్యతో కలిసి ఉన్న సమయంలో దుండగులు రవిని దారుణంగా హత్య చేశారు. రవి హత్యకు రెండో భార్య కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం రవి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Murder in Kuravi

Comments

comments