Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పిల్లలమర్రి చెట్టు

pillara-marry

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న పిల్లలమర్రి చెట్టు ఏడు శతాబ్దాలనాటిది. ఈ మహావృక్షాన్ని పీర్లమర్రి అని కూడా పిలుస్తారు. దేశంలో ప్రసిద్ధి చెందిన మూడు మర్రి చెట్లలో ఇదొకటి. కోల్‌కత్తా సమీపంలోని శివపురంలో ఉన్న ఆచార్య జగదీష్‌చంద్రబోస్ బొటానికల్ గార్డెన్‌లో ఉంది. మరోటి బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో ఉంది. పెద్ద పెద్ద కొమ్మలతో దాదాపు 3 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ వృక్షం నీడలో ఒక ముస్లిం మత పెద్ద సమాధి కూడా మనం చూడవచ్చు. విహార యాత్రలకు కూడా ఇది అనువైన ప్రదేశం. ఈ మహావృక్షం నీడలో వెయ్యి మందికి పైగా సేదతీరొచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మహావృక్షం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌కు 90 కి.మీ దూరంలో ఉంది. పిల్లలమర్రిలో ఈ వృక్షంతోపాటు మరికొన్ని ఆకర్షణీయ కేంద్రాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ చిన్నపాటి అక్వేరియం, జంతుప్రదర్శనశాల, బోటింగ్, కొత్తగా ఏర్పాటుచేసిన శివాలయం, గతంలో శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్టులో మునిగిపోయిన ఈ ఆలయాన్ని ఇక్కడ పునర్నిర్మించారు. ఈ మహావృక్షం చుట్టూ దాని సంతానం తరహాలో చిన్న చిన్న మర్రిచెట్లు ఉండటంతో దీనిని పిల్లల మర్రి అని పిలుస్తుంటారు. దీంతో పాటు మహబూబ్‌నగర్‌లో విస్తరించి ఉన్న నల్లమల్ల అడవుల్లో అనేక ఆకర్షణీయ ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశం మొత్తం నాగార్జునసాగర్, శీశైలం వన్యప్రాణి పరిరక్షణ పరిధిలో ఉండటం విశేషం. ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్న కొన్ని పర్యాటక కేంద్రాలలో గద్వాల కోట, అక్కడి చెన్నకేశవస్వామి ఆలయం, సోమశిల, అలంపూర్ ఆలయం, కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం, శ్రీరంగాపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం, ఉమామహేశ్వరంలో ఉమామహేశ్వరస్వామి ఆలయం, మల్లెల తీర్థం జలపాతం, జటప్రోలు అగస్తీశ్వరస్వామి ఆలయాలున్నాయి.

పిల్లల మర్రి మ్యూజియంను 1976లో ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన శిల్పాలను ఇక్కడ ఉంచారు. పాలమూరు అనగానే గుర్తుకొచ్చేది పిల్లలమర్రి చెట్టు , మహబూబ్‌నగర్ జిల్లాకు అధికార గుర్తుగా కూడా దీన్ని వాడుతున్నారు. ఈ చెట్టు పుట్టుక విషయంలో మాత్రం నేటికీ కచ్చితమైన సంవత్సరాన్ని ఎవ్వకూ కనుక్కోలేకపోయారు. ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుని 1947లో చర్యలు చేపట్టారు.

Comments

comments