Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

అడవిలో అలజడి

wgl

ఉత్తర తెలంగాణలో
పిఎల్‌జిఎ వారోత్సవాలు
ఉమ్మడి వరంగల్
జిల్లాలో రెడ్ అలర్ట్

వరంగల్‌బ్యూరో: ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యట న కరీంనగర్ జిల్లాలో మూడు రోజులపాటు సాగనున్నది. సిఎం పర్యటన ఖరారు అయిన వేళ ఉత్తర తెలంగాణ జిల్లాల అడవుల్లో అలజడి మొదలైంది. డిసెంబర్ 2నుంచి వారం పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బతగిలిం ది. గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. అక్కడినుంచి మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మెడిగడ్డ బ్యారే జీ నిర్మాణపనులను, కన్నెపల్లి వద్ద నిర్మాణమవుతున్న పంపుహౌజ్‌ను, అన్నారం బ్యారేజీ, సుందిళ్లపల్లి బ్యారేజీ పనులను సిఎం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
పిఎల్ జిఎ వారోత్సవాలను నిర్వహిస్తున్న మావోలు
సిపిఐ (మావోయిస్టులు) పార్టీ డిసెంబర్ 2నుంచి పిఎల్‌జిఎ వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పిలుపునిచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిఎల్‌జిఎ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దండకారణ్య సరిహద్దు ప్రాంతంలో అక్కడక్కడ పోస్టర్ల ను వేసింది. కరపత్రాలను పంపిణీచేశారు. నూగూరు వెంకటాపూర్ మండలంలో మంగళవారం మం దుపాతర్లను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీ ర్యం చేశారు. ఏజెన్సీ మండలాలైన ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కొత్తగూడ, వాజేడు, నూగూరు వెంకటాపూర్ తదితర ప్రాం తాలలో పిఎల్‌జిఎ వారోత్సవాల నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే భయంతో ఏజె న్సీ ప్రజలు భయపడుతున్నట్లుగానే బుధవారం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఏటూరునాగారం ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అడవులను జల్లెడపడుతున్న పోలీసులు
ఏటూరునాగారం ఏజెన్సీని ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకవైపున మావోయిస్టులు పిఎల్‌జిఎ వారోత్సవాల ను జరుపుకుంటుండగా మరో వైపున ఎన్‌కౌంట ర్ జరగడంతో ఏజెన్సీ అడవులను పోలీసులు జల్లడపడుతున్నారు. బుధవారమే కరీంనగర్ జిల్లా సిఎం పర్యటన ఖరారు కావడం అదే రోజు న ఎన్‌కౌంటర్ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం అన్నకోటలో సిఎం పర్యటన ఉండడంతో పోలీసులు అడవులలో ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఏరియా, తుపాకులగూడెం బ్యారేజీ ప్రాంతాలను సందర్శించి వెళ్లాడు. మహేందర్‌రెడ్డి పర్యటన నుంచి పోలీసులు స్పెషల్ పార్టీ బలగాలు అటవీ ప్రాంతంలో భారీ గా మోహరించాయి. తుపాకులగూడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని ఏరియా డామినేషన్‌పార్టీలు స్వాధీనం చేసుకున్నాయి.
అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాంతాన్ని, అన్నా రం బ్యారేజి, సుందీళ్లబ్యారేజి, కన్నెపల్లి పంపుహౌజ్ ప్రాంతాలను కూడా ఏరియా డామినేషన్ పార్టీలు తమ స్వాధీనంలోకి తీసుకోగా అటవీ ప్రాంతాన్ని అణువణువు గాలిస్తున్నారు.
గోదావరి పోలీసుల నిఘా
గోదావరి తీరం వెంట పోలీసు నిఘాను పెం చారు. మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోలు దండకారణ్యం వైపు రావచ్చని పోలీసులు గోదావరి వెంట నిఘా ఏర్పాటు చేశారు. మంగపేట నుంచి మంథని వరకు గోదావరి పొడవునా పోలీసు బలగాలను మోహరింపచేశారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఏమైన సంఘటనలకు పాల్పడవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే చత్తీస్‌గడ్‌తోపాటు భద్రచాలం, చర్ల ప్రాంతాలలో ఇన్‌ఫార్మర్ల నేపంతో మావోయిస్టులు ముగ్గురిని హతమార్చారు. గడిచిరోలి సంఘటనతో మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడవచ్చుననే పోలీసులు భారీగా బలగాలను మోహరింప చేశారు.

Comments

comments