Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

సాహితీ సంపదకు అపూర్వ నిదర్శనం బాలకవి సమ్మేళనం

taking

*మునిగడపలో 253 మంది బాల కవులతో కవి సమ్మేళనం
*అపూర్వ బాలకవి సమ్మేళనానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు
*జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి

మన తెలంగాణ/గజ్వేల్ రూరల్ : సాహిత్యానికి పురుడు పోసిన సిద్దిపేట జిల్లాలోని మునిగడప ఇవాళ సాహితీ సంపదకు అపూర్వ బాలకవి సమ్మేళనంతో నిలువెత్తు సంతకంలా నిలిచిందని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన అపూర్వ బాలకవి సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి, సమాజం సన్మార్గంలో నడవడానికి పుస్తకాలు దోహదపడతాయని చెప్పారు. ప్రస్తుత స్థితిగతులకు అనుకూలంగా రచయితలు ఆకర్షణీయంగా,ఆలోచనాత్మకంగా, తక్కువ నిడివి గల రచనలు చేయాలని సూచించారు. విద్యార్థులు పాఠశాల దశనుంచే పుస్తకపఠనం చేసేలా ఒక ఉద్యమం కొనసాగాలని చెప్పారు. సమాజానికి సుజ్ఞానాన్ని అక్షయ పాత్రలా అందిస్తున్న సాహిత్యాన్ని నేటితరం భవితకు అందించేలా సాహితీవేత్తలు కృషి చేయాలని సూచించారు. 253 మంది బాలకవులతో కవి సమ్మేళనం నిర్వహించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నందుకు విద్యార్థినీ, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల్లో తెలుగు భాష ప్రావీణ్యత వచ్చేలా వారిని మంచి కవులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన గొప్పదన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమ్మేళనంతో బాలలందరిలో మంచి ఆలోచనలు తెచ్చినందుకు బాలలంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రప్రభుత్వం తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించడం, ఇదే సమయంలో మన సిద్దిపేట జిల్లా నుంచి బాలలు సాహిత్యం పట్ల ఆసక్తి చూపడం సంతోషకరమైన విషయమని చెప్పారు. గజ్వేల్ డివిజన్‌తోపాటు జిల్లాలోని మిగతా రెండు డివిజన్‌లలో కూడా బాలకవి సమ్మేళనాలు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులంతా ఈ కవి సమ్మేళనాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే సఫలీకృతులవుతారని కలెక్టర్ సూచించారు.
అపూర్వ బాలకవి సమ్మేళన విజేతలకు బహుమతులు… అపూర్వ బాలకవి సమ్మేళనంలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి సిపిఆర్వో జ్వాలా నర్సింహారావులు కలిసి బహుమతులు అందించారు. వీరిలో తీగు ల్ గ్రామ జడ్పీహెచ్ ఎస్ విద్యార్థిని బి.కా వ్య మొదటి బహుమతి, చిన్నకిష్టాపూర్ గ్రామ జడ్పీహెచ్‌ఎస్ విద్యారిని అనూష ద్వితీయ బహుమతి, గొల్లపల్లి గ్రామ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని సి.హెచ్.శిరిష, నాల్గవ స్థానం మునిగడప పాఠశాల విద్యార్థిని పొందారు. అలాగే మరో ఐదు మంది వి ద్యార్థులకు కాన్సోలేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జగదేవ్‌పూర్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

comments