Search
Monday 23 April 2018
  • :
  • :

ప్రేమామృతం పంచిన కరుణామయుడు

jesus

-నేడు క్రిస్మస్ పర్వదినం
మనతెలంగాణ/బూర్గంపాడు:ప్రేమ,కరుణా,జాలి,దయ డుణాల సందేశాన్ని ప్రపంచ మానవాళికి పంచి పెట్టిన కరుణామయుడు పుట్టిన పవిత్రమైన రోజు క్రీస్మస్ పండుగ,ఈ పండుగ అనగానే కొత్త బట్టలు,కేకు కటింగ్,ఇంటిపైన స్టార్స్,క్రిస్మస్‌ట్రీ,క్రిస్మస్ తాతయ్యగురుకు వస్తాడు,ప్రపంచకాలాన్ని క్రీస్తు శంకంగా, క్రీస్తు పూర్వంగా విడదీసి చూస్తున్నారంటే యేసుప్రభువు ఎంతటి మహోన్నతుడో,ఎంతటి మార్గదర్శకుడో మనం మననం చేసుకోవచ్చు,ఆ కురుణామయుని క్రీస్మస్ పర్వదినం సందర్భంగా మనతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కధనం
క్రిస్మస్ ఆవిర్భావం/////
క్రిస్టీ,మాసీ అనే ఇంగ్లీష్ పదాల కలయిక వల్లే క్రీస్మస్ అనే పదం అవిర్భవించింది.లాటిన్ భాషలోని మిస్సా(ది హోలీ మాన్)అను పదానికి పర్యాయ పదంగా వచ్చిదని చెప్తుంటారు.గ్రీకు భాషలోని క్రిస్టోస్ అనే పదం నుంచి క్రిస్మస్ పుట్టిందని మరికొందరు చెప్తుంటారు.
పశువుల పాకలో ప్రభువు జననం///
బెత్లహామ్‌లోని పశువుల పాకలో అర్ధరాత్రి మేరీ మాత,యేసోబు దంపతులకు యేసుక్రీస్తుజన్మించారు.క్రీస్తు పుట్టిగానే దివ్యదూత ప్రత్యేక్షమై బెత్లహామ్ నగర శివారులో నివశించే జ్ఞానులకు,గొర్రెల కాపరులకు విషయం తెలియజేసింది.అప్పుడు ఆకాశంలోని దివ్యతార దారి చూపగా వారు పరుగునా పశువుల పాకకు వచ్చి బాల యేసును చూసి తరించారు.ఆ తరువాత జ్ఞానులు బాల చేసునికి బంగారం,కస్తూరి సుగంధ,ధ్రవ్యాలను ఆయనకు సమర్పించి ధన్యాత్యులయ్యాని ప్రచారంలో ఉంది.ఆప్పటి నుంచి ప్రతి డిసెంబర్24అర్ధరాత్రి దాటిన తరువాత క్రిస్మస్ పండుగను క్త్రెస్తవులు ఘనంగా జరుపుకుంటారు.
క్రిస్మస్ కేకు/////
క్రిస్మస్ కేకు తయారు చేయడం అనేది పూర్తిగా పాశ్చాత్య సాంప్రదాయం,పాశ్చాత్య భోజనంల్లో కేకు అంతర్భగం.ఇక ప్రత్యేక సందర్భలైన పుట్టిన రోజు,పెళ్ళిరోజుల్లో కుక్ కట్ చేయడం చూస్తుంటాం,అందుకే ఎంతో ముఖ్యమైన క్రిస్మస్‌కి కూడా కేక్ కటింగ్ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.క్రిస్మస్ కేక్ అంటే ప్రసాదం లాంటిదేం కాదు,అందరి నోటిని తీపి చేసి ఆనందంగా ఉండడానికి క్రిస్మస్ రోజున కేక్ కట్ చేస్తారు.
క్రిస్మస్ ట్రీ/////
18వ శతాబ్ధంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొందింది.ఆ చెట్టుకు దీపాలు పెట్టి మొదటగా అలంకరించింది సంస్కరణోద్యమ పితామహులు మార్టిన్ లూధర్.అప్పటి నుంచి క్రిస్మస్ చెట్టును ఆనందానికి,పచ్చదనానికి,సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలు గుర్తించే ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమూపోయింది.పైగా చెట్టుకు ఇవ్వమే తప్ప తీసుకోవడం తెలియదు,ప్రేమించిడం,క్షమించడం ప్రధానాంశాలుగా క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరిస్తారు.
బోలెడు బహుమతులిచ్చే క్రిస్మస్ తాత//////
క్రిస్మస్ తాత సంప్రదాయం మూడవ దశాబ్ధంలో పరిచయమయ్యాడు.డెన్మార్క్ సెంయింట్ నికొలస్ అనే భక్తి పరుడైన క్యాధరిక్ బిషాస్ ఉదాంతమే శాంతాక్లాజ్ సృష్టికి మూలమని చెబుతారు.నికొలస్ బిషాష్ గా ఉన్న ప్రదేశంలో ఒక పేద రైతు తన కుమార్తెలకు కట్నాలు ఇచ్చి పెళ్ళి చేయలేక అవస్ధలు పడుతుంగారు.దాంతో నికొలస్ బాషాస్ బంగారు నాణాలున్న మూడు చిన్న మూటలను చిమ్నీ దారా ఇంట్లోకి వదిలి వేళ్తాడు.అలా వదిలిన జారి అక్కడే అరబెట్టి ఉన్న సాక్స్‌లో పడ్డాయి అని అలా ఆయన చేసిన మేలు ఒక పేద రైతు ఇంట్లో ఆనందాన్ని నింపింది.క్రిస్మస్ ముందు రాత్రి పడుకున్న తరువాత క్రిస్మస్ తాత ఇంటింకి వెళ్లి బహుమతులు ఇంటి ముందు పెట్టి తలుపు కొట్టి వెళ్లి పోయేవారు అలా మనం క్రిస్మస్ తాత అని అంటాం.విదేశాల్లో అయితే శాంతాక్లాజ్ అంటారు
అధికారికంగా క్రిస్మస్ పండుగ/////
క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.పండుగ కానుకగా పేద క్త్రెస్తవులకు ప్రభుత్వం దుస్తులను పంపీణి చేస్తుంది.

Comments

comments