Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

జంతువుల కళేబరాలతో నూనే తయారీ

tank

మనతెలంగాణ/అచ్చంపేటటౌన్ :  ప్రజలకు ఇబ్బంది కలిగే పశువుల కళేబరాలతో నూనే త యారు చేసేందుకు హైదారాబాద్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు చౌటపల్లిలోని చంద్రవా గు దగ్గరలో ఉన్న పొలంలో  నూనే,  సబ్బులు తయారు చేసేందుకు గత రెండు రోజుల క్రితమే తయారీదారులు అక్కడ నూనే తయా రు చేయుటకు కొన్ని పరికరాలతో పాటు దా దాపు 50 డ్రమ్ములను ఏర్పాటు చేశారు. నూనే తయారీకి ఉపయోగించే కళేబరాలను కూడ కొంత సేకరించి నూనే తయారు చేసేందుకు అన్నివిధాలుగా సిద్ధ్దమయ్యారు. దీనిని గమ నించిన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులు కొంతమంది బల్మూర్ ఎస్సై వెంకన్నకు సమా చారం అందించగా ఎస్సై తన సిబ్బందితో కలి సి ఆప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటు వంటి డ్రమ్ములను ఇతర సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. దాంతో పాటు నూనెకు  త యారు చేసే ద్రవ పదార్థాన్ని కూడ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న కొంతమందిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. అక్కడనుంచి నేరుగా వారిని అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి విచారించారు. సంఘటనపై అ చ్చంపేట సిఐ రామకృష్ణ వివరణ కోరగ వారికి చౌటపల్లి సితారాంపూర్ గ్రామాల మధ్యన హైదారాబాద్‌కు చెందిన కొంతమంది వ్యక్తు లు నూనె, ఇతర ద్రవపదార్థలను తయారు చేసేందుకు నూనె తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పశువుల కళేబరాలను సేకరించి నూనే  తయారు చేస్తున్నట్లు  వ్యవసాయ రైతుల సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూనే తయారు చేసే ఏర్పాటు కేంద్రానికి ప్రభుత్వం లైసైన్స్ జారీచేసిందని వారి వద్ద వుందని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అస్కారం లేదని అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగేవిధంగా ఉంది కాబట్టి వాటిని ధ్వంసం చేశామని వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని వారిని ఆదేశించినట్లు సిఐ రామకృష్ణ తెలిపారు.

Comments

comments