Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు

madam

*నగర పంచాయతీ చైర్‌పర్సన్ కవితా సురేందర్‌గౌడ్
*జనవరిలోగా ప్రారంభించకపోతే రోడ్డెక్కుతాం
*కాంట్రాక్టర్‌నే లక్షంగా పెట్టుకున్న ఎమ్మెల్యే
*మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా పంచాయతీలో
నిధులు కరువంట

మన తెలంగాణ/జోగిపేట టౌన్ : గత నాలుగు రోజులుగా మన తెలంగాణ పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని అంథోలు, జోగిపేట నగర పంచాయతీ కౌన్సిల్ స్పందించి ముందుగా పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిల్ విలేకరుల సమావేశంకు చైర్‌పర్సన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎస్.కవిత సురేందర్‌గౌడ్ మాట్లాడుతూ నగర పంచాయతీలో ఇటీవల 6 కోట్ల రూపాయలకు జరిగిన టెండర్ పనులను స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్ పనులు చేపట్టకుండా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నగర పంచాయతీ కౌన్సిల్ తీర్మానం చేశాక అభివృద్ధి పనులను అడ్డుకోవడం సబబుకాదని ఆమె అన్నారు. గతంలో నిర్వహించిన రీటెండర్‌లను అన్‌లైన్‌లో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇస్తే పంచాయతీ ఎఇకి సంబంధించిన కాంట్రాక్టర్‌కు మార్కింగ్ ఇవ్వొద్దని ఆదేశించడం ఎంతవరకు న్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కావడంతోనే నేడు ఎమ్మెల్యే పంచాయతీ అభివృద్ధిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. పంచాయతీలో ఒకేసారి నిర్వహించిన టెండర్‌లను అందులో ఎమ్మెల్యే అనుచరుడు టెండర్ వేసి దక్కించుకున్న వాటికి మిషన్ భగీరథ అడ్డుకాదని, కాంగ్రెస్ కాంట్రాక్టర్ పనులు చేపడితే మిషన్ భగీరథ అడ్డువస్తోంది అనడం ఎంతవరకు సమంజసమన్నారు. గత వేసవి కాలంలో నగర పంచాయతీకి దాహర్థి తీర్చింది ఆ కాంట్రాక్టరే అని, మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా పనులకు నేటి వరకు సంబంధించిన కాంట్రాక్టర్‌కు నిధులు మంజూరు చేయకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎమ్మెల్యే అని అన్నారు. జోగిపేట పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు కూడా మిషన్ భగీరథ అడ్డువస్తోందా అంటూ ప్రశ్నించారు. కేవలం నగర పంచాయతీలో ఎమ్మెల్యే అనుచరుడు టెండర్లలో దక్కించుకున్న పనులు మాత్రం చేయించడం, మిగిత మౌలిక సదుపాయలను పనులను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే  ఇప్పటికైనా నియంతలా ప్రవర్తించడం మానుకోవాలని, లేదంటే  తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, తుపాకుల సునిల్, గాజుల నవీన్‌లతో పలువురు ఉన్నారు.

Comments

comments