Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

రబీ సీజన్ రైతులకు 31 వరకు బీమాకు అవకాశం

madamమన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రబీ సీజన్‌కు డిసెంబర్ 31వ తేదీలోగా బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ దివ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో వ్యవసాయ, బ్యాంకర్లు, పరిశ్రమల శాఖల అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరి, శనగ, జొన్న, వేరుశనగ, ఉల్లిగడ్డ పంటలకు నిర్ణీత సమయంలోగా పంట బీమా చేసుకునేలా అదేవిధంగా ఇప్పటికీ బీమా చేసుకున్న రైతులు రెన్యూవల్ చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గతంలో బీమా చెల్లించిన రైతుల వివరాలను వారం రోజుల్లోగా సేకరించి నివేదిక సమర్పించినట్లయితే వారికి రెన్యూవల్ చేసుకునేలా చర్యలు తీసుకోబడుతాయని ఆమె అధికారులకు సూచించారు. రెన్యూవల్ చేసుకునే రైతులకు తప్పనిసరిగా బ్యాంకర్లు రశీదులను అందజేయాలని తెలిపారు. పంటల బీమా చేసుకునే రైతులకు బీమా వల్ల కలిగే లాభాలతో వేసిన పంటకు మాత్రమే బీమా వర్తిస్తుందన్న విషయంపై అవగాహన కల్పించాలని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలకై దరఖాస్తుల చేసుకున్న వారికి వారు ఎంచుకున్న వ్యాపారంపై అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో అర్హులైన యువ ఔత్సాహికులను ఎంపిక చేసుకోవాలని, కోటి 50 లక్షల రూపాయల రుణాల లక్షాన్ని పూర్తి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఇందులో జిరాక్స్, మొబైల్ రిపేరింగ్, టైలరింగ్‌లలో ఆసక్తి ఉన్న వారిని క్రితమే రుణాలు పొంది సబ్సిడీ క్లేయిం అయిన వాటికి వినియోగ ధృవప్రతాలను వెంటనే జారీ చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా లబ్దిపొందేందుకు దరఖాస్తు చేసుకున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ అభ్యర్థులకు సంక్రాంతిలోపు ఇంటర్వూలను నిర్వహించి అర్హులైన వారికి మంజూరీలు ఇవ్వాలని డిఐసి జిఎం సమ్మయ్యను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే 107 దరఖాస్తులు ఆమోదం పొందగా ఇప్పటికీ 75 యూనిట్లు మొదలయ్యాయని అన్నారు. 15 యూనిట్లు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్ డిఎం సుమలత, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవరావు, ఆర్టీవో కిషోర్, డిఐపిసి సభ్యుడు చైతన్య, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments