Search
Sunday 27 May 2018
  • :
  • :

రాహుల్ … కాంగ్రెస్ డార్లింగ్

RAHUL---MANMOHAN

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ పార్టీ డార్లింగ్ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్‌సింగ్ మాట్లాడారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ డార్లింగ్ అని, ఆయన పార్టీ సంప్రదాయాలను నిబద్ధతతో పాటిస్తారని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి సోమవారంతో నామినేషన్  గడువు ముగిసింది. రాహుల్ మినహా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరూ పోటీ పడే అవకాశం లేదు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. సోమవారం సాయంత్రమే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rahul … Congress Darling

Comments

comments