Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

11న రాహుల్‌కు పార్టీ పగ్గాలు

Rahul-gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఒక్కరే రంగంలో మిగిలారు. దీనితో ఆయన పోటీ లేకుం డా ఈ కీలక స్థానం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పలువురు పార్టీ నేతలు రాహుల్ గాంధీ తరఫున నామినేషన్ పత్రాలను వేశారు. వీటిని పరిశీలించిన తరువాత రాహుల్ గాంధీ ఒక్కరే అర్హమైన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన వ్యక్తిగా నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ముళ్లపల్లి రామచంద్రన్ మంగళవారం తెలిపారు. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క అభ్యర్థి అది రాహుల్ గాంధీ అని వెల్లడించడంతో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు అయింది. రామచంద్రన్ ఆధ్వర్యంలోనే పార్టీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయన పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. దాఖలు అయిన  మొత్తం 89 నామినేషన్ పత్రాలలో అన్ని కూడా రాహుల్ గాంధీ పేరు ప్రతిపాదించారని రామచంద్రన్ చెప్పారు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైందని వివరించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 11. ఆ రోజే కాంగ్రెస్ అధ్యక్షుడి పేరును రిటర్నింగ్ అధికారి వెల్లడిస్తారు.

Comments

comments