Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

రాజన్న సిరిసిల్లను అగ్రభాగన నిలపాలి:కెటిఆర్

krr

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కెటిఆర్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే వేసవి నాటికి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులపై మంత్రి చర్చించారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాల పురోభివృద్ధిని మంత్రి కెటిఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలో మరో రెండు పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలో అగ్రాభాగాన నిలబెట్టాలని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ భేటిలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, జిల్లా కలెక్టర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

comments