Search
Monday 11 December 2017
  • :
  • :

పాముల్ని పట్టడంలో నేర్పరి ‘రాజి’

                   Snake

తిరువనంతపురం: పామును దగ్గరగా చూస్తేనే మనం ఎంతో భయపడిపోతాం. అలాంటిది, 33 ఏళ్ల జెఆర్ రాజి పిల్లలు ఆటలాడుకున్నంత సులభంగా పాములను పట్టేస్తోంది. అది భయంకరమైన కోబ్రా కావచ్చు లేదా విషపూరితమైన పైథాన్ కావచ్చు.. కాని రాజీ దేనికీ భయపడదు. వాటిని అవలీలగా పట్టుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పశ్చిమ కనుమల కొండలపై ఉన్న పాలోడ్‌లోని నన్నియోడ్ గ్రామానికి చెందిన రాజీకి పాముల్ని పట్టడం అనేది ఓ హాబీ మారింది. దీన్ని ఒక సామాజిక సేవ కోణంలోనే చేస్తున్నట్టు ఆమె చెబుతోంది.  గత తొమ్మిది నెలల్లో ఆమె తిరువనంతపురం, కొల్లం జిల్లాల్లో ని వివిధ ప్రాంతాల్లో 119  పాములను పట్టుకుని ఈ వృత్తిలో మహిళలు కూడా రాణించగలరని నిరూపించింది. మానవ నివాసాల్లో ప్రవేశించిన కోబ్రాస్, కొండచిలువలు వంటి ప్రమాదకరమైన పాములను పట్టుకోవడానికి ప్రయ త్నించినప్పుడు, వాటి కాటు నుంచి చాకచక్యంగా తప్పించు కుంటూ వాటిని పట్టుకుని రక్షించింది.

70 కోబ్రాస్, 11 విపెర్స్, ఏడు కొండచిలువలు, ఇంకా అనేక పాములను ఈ విధంగా ఆమె పట్టుకుని, అటవీ ప్రాంతాలకు తరలించింది.  ఇద్దరు పిల్లల తల్లి అయిన రాజి రాకపోకలకు ఎక్కువగా స్కూటర్‌ను వినియోగిస్తుంటుంది. పాము కనిపించిందని ఎ వరైనా చెప్పగానే స్కూటర్‌పై క్షణాల్లో అక్కడికి చేరుకుంటుం ది. పైసలు తీసుకోకుండా పాము పట్టి అటవీ ప్రాంతంలో వదిలి పెడుతుంది.  ‘మాది ఒక అటవీ ప్రాంతం. రోజు అనేక రకాల పాములు చూస్తున్నాం. అందువల్ల నా బాల్యం నుంచి పాములంటే నాకు అసలు భయమే లేదు. సామాజిక సేవ కోణంలోనే నేను ఓ బాధ్యతగా పాములు పడుతున్నాను, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాను. దీన్ని ఎప్పటికీ కొనసాగి స్తాను’ అని రాజి పిటిఐకి చెప్పారు.

Comments

comments