Search
Saturday 21 April 2018
  • :
  • :

రాజీమార్గంతోనే సమస్యలు పరిష్కారం

mam

సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : రాజీమార్గంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మాట్లాడుతూ సామాజిక న్యాయం అన్నట్లు కక్షిదారులందరి రాజీ కేసులు పరిష్కరించబడతాయన్నారు. రెవెన్యూకు సంబంధించిన కేసులను కూడా ఈ లోక్‌అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కక్షిదారులు కోర్టు చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం అవటం లేదని, రాజీమార్గంలో వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందరూ సమయభావం, స్నేహ వాతావరణంలో మెలిగితేనే శాంతి నెలకొంటుందన్నారు. న్యాయ వ్యవస్థతో పాటు రెవెన్యూ , పోలీసుశాఖ , వివిధ శాఖల వారు కలిసి పనిచేస్తారనే భావన కల్గించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. రెవెన్యూ, పోలీసు కేసులు పరిష్కరించబడతాయన్నారు. తమకు తామే రాజీ పడే విధంగా కక్షిదారులు ముందుకు రావాలన్నారు. అనంతరం ఆర్‌డిఒ రమేష్‌బాబు, అడిషనల్ ఎస్‌పి గోద్రు మాట్లాడుతూ తెలిసి తెలియకుండా క్షణికావేశంలో తప్పులు జరుగుతుంటాయని, ఆ తప్పులను తెలుసుకుని రాజీ మార్గంలో సరిదిద్దుకోవాలన్నారు. ఈ జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో సమస్య సత్వర రాజీ మార్గానికి దోహదపడుతుందన్నారు. అందువల్ల మీ కేసులు మీరే స్వతహాగా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలన్నారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి హేమలత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సురేష్‌లు మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని, ప్రజలు చట్టాల గురించి అవగాహన కల్గి ఉండాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజీ మార్గమే రాజామార్గమన్నారు. అంతకు ముందు కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ, అడిషనల్ ఎస్‌పి గోద్రు, ఆర్‌డిఒ రమేష్‌బాబులు మొక్కలను నాటారు. ఈ లోక్‌అదాలత్ కార్యక్రమంలో 36 కు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, అటవీశాఖ అధికారులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments