Search
Monday 11 December 2017
  • :
  • :

20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ration

మనతెలంగాణ/చిట్యాల: మండలంలోని నవాబ్‌పేట గ్రామంలో శనివారం రాత్రి బొలెరో వాహనం లో అక్రమంగా తరళిస్తున్న 20క్వింటాళ్ళ రేషన్ బి య్యాన్ని పట్టుకున్నట్లు సిఐ గండ్రాతి మోహన్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ విధినిర్వహనలో భాగంగా నవాబ్‌పేట గ్రామంలో ఎస్‌ఐ యాసిర్ ఆరాఫత్ వాహనాలను తనికీ చేస్తుండగా బొలెరో (టిఎస్03 యుబి 9210)గల వాహనంలో అక్రమంగా తరళిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. వాహనంతో పాటు బియ్యాన్ని స్థాని క పోలీస్ స్టేషన్‌కు తరళించినట్లు సిఐ తెలిపారు. డ్రైవర్ సాదు తిరుపతి, యజమాని బోయిని రాజుతో పాటు మరో వ్యక్తి ఇండ్ల రాజుకుమార్‌లు పరారీలో ఉన్నారని చెప్పారు.కాగా బొలొరె వాహనంతో పాటు ముగ్గురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పెర్కొన్నారు. ఎస్‌ఐ యాసిర్ ఆరాఫత్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments