Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

‘జియో’ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్

jio

ముంబయి: రిలయన్స్ జియో అనతికాలంలోనే కోట్లాది మంది కస్టమర్లను సంపాదించుకుని దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి జియో వివిధ ఆఫర్లతో తన వినియోగదారులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కొన్ని రోజుల క్రితం ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ గడువును తొలుత నవంబర్ 25వ తేదీగా నిర్ణయించింది. అయితే కస్టమర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనను గమనించిన రిలయన్స్ అధికారులు ఆ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ గడువును మళ్లీ పొడిగించింది జియో.

పొడిగించిన గడువు ప్రకారం ఈ నెల 25 వరకు జియో వినియోగదారులు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ. 399 ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రీచార్జి చేసుకుంటే రూ. 400 విలువ గల ఎనిమిది ఓచర్లు లభిస్తాయి. రూ.50తో కూడిన ఎనిమిది ఓచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు రూ.1899 విలువైన డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. వీటిని యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వినియోగించుకోవచ్చు. ఇలా మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్ చేస్తోంది.

Jio-Triple-Cash-Back

Comments

comments