Search
Friday 20 April 2018
  • :
  • :

కోరుకున్న కార్ లో షికార్

బైక్‌లు, కార్లు ఉన్నవారికి కొన్నేళ్లుగా అదే వాహనాన్ని వాడటంతో బోర్ కొడుతుంటుంది. మార్కెట్‌లోకి కొత్తగా ఏదైనా వాహనం వచ్చినా, రోడ్డుపై కొత్త బైక్, ఆడీ కార్ల లాంటి వెరైటీ వాహనాలను చూసినా అబ్బా వాటిని ఒక్కసారి నడిపితే బాగుండు అనిపిస్తుంది. అనిపించినవన్నీ కొనలేంకదా! మరెలా! అలాంటివారి కలలను నెరవేర్చడానికి సెల్ఫ్ డ్రైవ్. సెల్ఫ్ రైడ్ అనే కాన్సెప్ట్‌తో నగరానికి చెందిన అశ్విన్‌జైన్, కెదర్‌లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో  డ్రైవెన్ పేరుతో  షోరూంలను ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కూడా వీరు తమ సేవలను అందిస్తున్నారు.  పెద్ద కార్లు, ఇంపోర్టెడ్ బైకులను రైడ్ చేయాలనుకున్నా, స్థోమత లేనివారికి అద్దెకు కారు, బైక్, సైకిల్ ఇస్తారు.   ఇక్కడి బైక్‌లను చూసేందుకు వచ్చినవారు ఓ గంట రైడ్‌కు వెళ్తున్నారు. నగర యువత, కార్పొరెట్ దిగ్గజాలు సైతం తమకు నచ్చిన వాహనంలో షికారు చేసి వస్తున్నారు. 

Driven-Cafe

ఏ బైక్ అయినా సరే..

స్ట్రీట్ బైక్స్, క్లాసిక్, క్రూయీజర్స్, టౌరెర్స్, స్పోర్ట్ బైక్‌లు డ్రైవన్ షోరూంలో అందుబాటులో ఉంటాయి. వీటిలో 100సీసీ నుంచి హోండా నావీ, ఆప్రిలియా ఎస్‌ఆర్150, కేటీఎం డ్యూక్ 390, కేటీఎం ఆర్‌సీ 390బైక్‌లతోపాటు బుల్లెట్ 500, హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, డుకాటీ స్క్రాంబ్లర్, రాకెట్ 3, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, టైగర్ ఎక్స్‌ప్లెరెర్ ఎక్‌సీ తదితర బైక్‌లున్నాయి. స్పోర్ట్ బైక్‌ల్లో బెనెల్లీ 600ఐ, కవాసకీ నిన్జా 650, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, హోండా సీబీఆర్ 650ఎఫ్, సుజుకీ హయబుసా వంటి వాహనాలు బైక్ రైడర్లను ఆకట్టుకుంటున్నాయి.

కార్లూ అంతే…

కార్లలో హచ్‌బ్యాక్, సెడాన్, సువ్‌మువ్, లగ్జరీ, సూపర్‌కార్ విభాగాల్లో సుమారు 80 రకాల కార్లను అద్దెకిస్తున్నారు.
వీటిలో నానోకారు నుంచి వోల్వొ వీ 40 వరకున్నాయి. సెడన్‌లో ఫోర్ట్ ఫిగో, హోండా ఆమేజ్, స్కోడా, స్కోడా రేపిడ్, సుజుకీ సియాజ్, వోక్స్‌వాగన్, స్కోడా రాపిడ్‌వంటి కార్లు ఉంచారు. సువ్‌మువ్‌లో ఇన్నోవా, ఫోర్ట్ ఎకోస్పోర్ట్, మహేంద్ర ఎక్స్‌యూవీ 500, మెర్సిడెస్, ఆడీ క్యూ3, వోల్వొ, ఎక్స్‌సీ 60, ఎక్స్‌సీ 90, ఆడి క్యూ 7, వోల్వొ ఎక్స్‌సీ 90వంటి కార్లున్నాయిక్కడ. లగ్జరీ కార్లలో ఆడీ ఏ4, బీఎండబ్లూ-3 సిరీస్, 5సిరీస్, ఆడీ ఏ6, జాగ్వార్ ఎక్స్‌జేఎల్, మెర్సెడెస్ ఎస్ 350లున్నాయి. సూపర్‌కార్ విభాగంలో పోర్షే 911, ఫోర్ట్ ముస్తాంగ్, మసెరట ఘిబ్లివంటివి అద్దెకు దొరుకుతాయి.

కిరాయికి తీసుకోవాలంటే..

ఆధార్‌కార్డ్ జిరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌లను షోరూంలో ఇవ్వాలి. దీంతోపాటు కొంత నగదు డిపాజిట్ చేయాలి. బైక్, కార్ రైడ్ అయిన తర్వాత నిర్వాహకులకు దానిని అప్పగించిన ఏడు రోజుల్లో డిపాజిట్ చేసిన డబ్బును వెనక్కి ఇస్తారు.

రిపేర్ వస్తే…

బైక్‌తో షికారుకు వెళ్లినప్పుడు మధ్యలో రిపేర్ వస్తే నిర్వాహకులకు సమాచారం ఇవ్వాలి. వారు ఓ వెహికల్‌లో మెకానిక్‌ను, మరో బైక్‌ను పంపిస్తారు. కార్లకూ ఇవే జాగ్రత్తలు తీసుకుంటారు.

మహిళలకు రాయితీ

బైక్, కార్ రైడ్ చేయాలనుకునే యువతులకు, మహిళల కు చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం విశేషం.

చార్జీల వసూలు ఇలా…

స్ట్రీట్ బైక్స్‌కు గంటకు రూ. 60చొప్పున చార్జి చేస్తున్నారు. క్లాసిక్స్, క్రూయేసర్స్‌లో బుల్లెట్ 500కు రూ.175, ట్రయంఫ్ రాకెట్3కి రూ. 1800 చొప్పున ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు రూ.175, బెనెల్లీ 600కు రూ. 500, ట్రయంఫ్ టైగర్ ఎక్స్‌ప్లోరెర్‌కు రూ.1100తో ప్రారంభమౌతోంది. స్పోర్ట్ విభాగంలో బెనెల్లీ 600ఐకి రూ.700, కవాసకీ నిన్జా 650కి రూ. 700, ట్రయంఫ్ డెటోనా 675కి రూ. 750, సుజుకీ హయబుసా రూ.1800కు ఇస్తున్నారు. కార్లకైతే నానోకారు రూ. 55, హ్యుండాయ్ ఈయోన్ రూ.75, వోక్స్ వ్యాగన్ పోలో రూ. 155, వోల్వొ వీ40రూ.385, స్కోడా ర్యాపిడ్ రూ. 220ఇస్తున్నారు. ఇన్నోవా ఊ.275, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ రూ.275, మహీంద్రా థార్ రూజ385, మెర్సెడెస్ రూ. 825, ఆడీ క్యూ 3 కి రూ.825, వోల్వొ ఎక్స్‌సీ 90కి రూ.140గా ధరలు నిర్ణయించారు. లగ్జరీ విభాగంలో వొల్వో ఎస్60కి రూ. 440, బీఎండబ్లూ 3సిరీస్ రూ.

825, ఆడీ 6కి మెర్సెడెస్ ఈక్లాస్‌కు రూ.990, బీఎం 7సిరీస్‌కు రూ.1650 గా ఉంది. పోర్షే, ఫోర్డ్ ముత్సాంగ్‌లకు రూ.4400 చార్జివేస్తారు.

కారు, బైక్ అద్దెకు కావాల్సినవారు 75693 74836 నెంబర్‌కు డయల్ చేస్తే అన్ని వివరాలు చెబుతారు. www.driven.in వెబ్‌సైట్‌లో రెంటల్స్, ఏయే మోడల్స్ ఉంటాయో తెలుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, అన్నపూర్ణ స్టూడియో, గచ్చిబౌలి ఎస్‌బీరోడ్‌లో గల షోరూంల వద్ద తెలుసుకోవచ్చు.   

Comments

comments