Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఘనంగా శ్రీనివాసరామానుజన్ జయంతి

photoమనతెలంగాణ/పుల్‌కల్ : గణితశాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతి వేడుకలు శుక్రవారం మండల ంలో ఘనంగా జరిగాయి. మండలంలోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మండల కేంద్రమైన పుల్కల్ జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలలో ప్ర ధానోపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ అధ్వర్యంలో రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణితశాస్త్రానికి ఉపయోగించే పరికరాల గురించి విద్యార్థులకు వివరించారు. గణితశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా అనేక నామూనాలు, చార్టులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ము ందుకు నడువాలన్నారు. దీంతో పాటు శివంపేట, చౌ టకూర్, కోర్పోలు, గొంగ్లూరు, మిన్‌పూర్, ముదిమాణి క్యం, సింగూరు, పెద్దారెడ్డిపేట, సింగూరు గురుకులం, ఆ దర్శ పాఠశాలల్లో గణితశాస్త్రానికి సంబంధించిన పరికరాలను ప్రదర్శించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమృత, రఘుపతి, దు ర్గాప్రసాద్, వెంకటేశం, తాజోద్దీన్, రవికుమార్, మా ణ య్య, స్వామి, చెన్నకేశ్వర్, అనిత, సురేశ్, పీఈటీ మశ్చందర్ తదితరులు పాల్గొన్నారు.  దుబ్బాకలో…జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని డీగ్రీ కళాశాలలో అద్యపకులు ఘణంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాసరామనుజన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్దలకు శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్ర ప్రావీణ్యతను వివరించారు. అనంతరం విద్యర్దులకు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిన్సిపాల్ రాజు, గణితశాస్త్ర అధ్యపకుడు ఆంజయ్య, సలీంపాష, అంజయ్య, నాగేశ్వర్, వెంకట్‌రెడ్డి, స్వాతి, అనుపమ, రాజు తదితరులు పాల్గోన్నారు.
సరస్వతి గ్లోబల్ స్కూల్లో లో జయంతి…గణిత శాస్త్ర ప్రావీణ్యుడు శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలను సరస్వతి గ్లోబల్ స్కూల్ లో విద్యార్దల నడుమ ఉపాధ్యాబృందం ఘణంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్దులు గణిత శాస్త్రానికి సంభందించిన అనేక ఎగ్జిబిట్సను ప్రదర్శించారు. విద్యార్దుల ప్రదర్శించిన తీరును మండల విద్యాదికారి వెంకటయ్య అభినందించారు. ఈ విషయమై వారు మాట్లాడుతూ…శ్రీనివాసరామనుజన్ జీవిత విశేషాలను అతని జీవిత ముఖ్య ఘట్టాలను విద్యార్దులకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండలశాఖ అధ్యక్షుడు తెలంగాణ గణిత ఫోరం జనరల్ సెక్రటరి గంట్యాల రాజేందర్, టిఎస్‌యుటిఎఫ్ జనరల్‌సెక్రటరి బొంబాయి శ్రీనువాస్, ప్రధానోపాద్యాయులు రమేష్, కనకారెడ్డి, కడవేర్గు లక్ష్మినారాయణ, యాదగిరిగౌడ్, బాబా, సిహెచ్ రాజు, అనిల్‌పాల్గోన్నారు.

Comments

comments