Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

సామ్…ఏమడిగినా చెబుతాడు!

                     Robo

ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సు కలిగిన పొలిటీషియన్ రోబోను తయారుచేశాడు ఓ శాస్త్రవేత్త.  స్థానిక అంశాలు, పథకాలు, విద్య , వలసలు వంటి వాటిపై సందేహాలను ఏమడినా సరే టకీమని సమాధానాలు చెబుతుందట.   న్యూజిలాండ్‌కు చెందిన 49 ఏళ్ల నిక్‌గిరిస్టన్ ఈ వర్చువల్ పొలిటీషియన్‌ను తయారుచేసి, సామ్‌గా పేరు పెట్టాడు.  దీనిపై ఇంకా పరిశోధన చేయాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. సామ్‌కు చాలా అంశాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని, అన్ని దేశాలకు సంబంధించిన విషయాలు, వివిధ రకాల సమస్యాత్మక అంశాలు, వాతావరణ మార్పులు, సమానత్వం వంటివి కూడా నేర్పించాలని తెలిపారు. ఈ ఏ1 పొలిటీషియన్ ఫేస్‌బుక్  మెసెంజర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ..వారికి సమాధానాలు ఇస్తూ, వారి నుంచి కూడా కొంత నేర్చుకుంటాడట.

Comments

comments