Search
Sunday 21 January 2018
  • :
  • :

మిషన్ కాకతీయ 4వ దశ పనులకు రూ.4.18 కోట్లు మంజూరు

harish2

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో మిషన్ కాకతీయ 4వ దశ పనులకు 4.18 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్టు మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరిపాలనా అనుమతుల ఉత్తర్వులు జారీ అయినట్టు వెల్లడించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను చేపడుతున్నట్టు తెలిపారు. 4వ దశలో సిద్దిపేట పట్టణంలోని గణపతికుంటకు 19.50లక్షలు, సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లి రాఘవాపూర్‌లోని  జిల్లకుంటకు 30.75 లక్షలు, బుద్దకుంట అంకంపేటకు 14 లక్షలు, రాజన్నకుంటకు 10.30 లక్షలు, నారాయణరావుపేట బోయిన్ల ఒర్రె చెక్‌డ్యామ్‌కు 11.20లక్షలు, కాళ్లకుంట గాడిచెర్లపల్లికి 34.45 లక్షలు, చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి పెద్ద గండి చెరువుకు 1.12 కోట్లు, దాసర్‌పల్లి లొద్దికుంటకు 45.75 లక్షలు, పాముల పర్తి పటేల్ చెరువుకు 35.80 లక్షలు, అనంతసారగర్ బోడకుంట ఫీడర్ ఛానల్‌కు 21.50 లక్షలు, అంకంపేట చెక్‌డ్యామ్‌కు 9.10 లక్షలు, తిమ్మాయిపల్లి గొర్రెలకుంటకు 9 లక్షలు, సంగాపూర్ చింతలచెరువుకు 21 లక్షలు, మునిగడప సోమనికుంటకు 15.10 లక్షలు, శేరుపల్లి సోసానికుంటకు 11.10లక్షలు, సీతారాంపల్లి అంకనికుంటకు 18.20 లక్షలు, మంజూరైనట్టు తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ప్రజల హర్షాతిరేకాలు : సద్దిపేట పట్టణ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లోని గణపతి కుంటకు మిషన్ కాకతీయ 4వ దశకు నిధులు మంజూరు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణపతి కుంట సమీపంలో నివసం వున్న ప్రజలకు వర్షాకాలంలో నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందికలుగుతోంది. ఈ విషయం గురించి మంత్రి దృష్టికి స్థానికులు తీసుకవెల్లారు. మంత్ర హరీష్‌రావు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు మంజూరు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments