Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

అభివృద్ధి పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా

tractor
మన తెలంగాణ/దేవరుప్పుల: మండల పరివాహక గ్రామాల నుంచి అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను అక్రమ రావాణా చేస్తున్నారని దేవరుప్పు ల, కడవెండి గ్రామ రైతులు ఇసుక ట్రాక్టర్లను వేర్వే రుగా అడ్డుకున్నారు. దేవరుప్పుల వాగు నుండి డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పేరు మీద పర్వతగిరి మండలం సోమవారం గ్రామానికి అనుమతు లు పొందగా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ శివారులో ఇసుకడంపు చేయడం పట్ల పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణంకోసం 80ట్రాక్టర్లకు అనుమతులు పొందగా దేవరుప్పుల మండలవాగు నుండి అధికారపార్టీ నాయకులు అనుమతులు పొంది ఇసుక రావాణా చేస్తుండం, చాలా దూరంలో ఉన్న  పర్వతగిరి మండలానికి ఇసుక రావాణా చేయడంలో ఆంతర్యమెంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికా ర పార్టీ నాయకుల అండదండలతో ఇసుక రావాణా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అరోపిస్తున్నారు. దేవరుప్పుల మండలం ఇసుక మాఫీయాకు అండాగా మారిందని, అభివృద్ది పనుల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రావా ణా చేస్తున్నారని అరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దేవరుప్పుల మండలం ఎడారిగా మారుతుందని అవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు మొక్కుబడి కేసులు, జరిమానాలు వేయడంతో స్థానికుల అనుమానాలకు బలం చేకూరుతుంది.

Comments

comments