Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

తిక్క కుదరాలంటే…

Cartoon-New

అబద్ధ మాడరాదు… సత్యమునే పలుక వలెను అని చిన్నప్పుడు పెద్దలు చెబుతుంటే వినడమే కాక స్కూలు గోడలమీద ఇండిపెండెన్స్‌డేకి రంగుల అక్షరాల్లో రాశాం కూడా. అవి అమాయకపు రోజులు. అబద్ధ మాడరాదు అని చెబితే పెద్ద జోక్ విన్నట్లుగా నవ్వే వాళ్లు ఇప్పుడు రాజ్యాలు ఏలుతున్నారు. దేశ భక్తి, దేముడి భక్తి ఏదైనా సరే అబద్ధాలు ఓట్లు తెస్తాయని నిరూపిస్తున్నారు ఆ అబద్ధ సామ్రాట్టులు. అబద్ధాలకి ఓ భగవద్గీత తయారవుతోంది. కొంచెం ఆగండి. ఎన్నైనా చెప్పండి. నాది దేముడి పార్టీ కాదు. గుళ్లలో ఉంటాడో లేదో తెలియని దేముడు ఫలానా వారి పార్టీలో ఉన్నడంటే ఎలాగండీ నమ్మేది?

ఎంత కాదన్నా అబద్ధాలు ఆకర్షణ శక్తిగలవి. ఒకరు గాంధీ గారిని చూసి సత్యసంధత నేర్చుకొన్నానంటే నమ్మ బుద్ధి అవుతుంది. కాని హరిశ్చంద్రుడితో అనుకోకుండా కుదిరిన స్నేహంవల్ల నిజమే చెప్పాలని నేర్చుకొన్నానని ఎవరైనా అంటే ‘ నీ బతుకు చెడ’ అని తిట్టాలనిపిస్తుంది. హరిశ్చంద్రుడి సమకాలికులు ఎవరూ అనని మాట మన సమకాలికులు అంటే మొత్తబుద్ధి అవుతుందా లేదా! పైగా హరిశ్చంద్రుడి కథ నిజం అంటే భయపడేలా చేస్తుంది. అబద్ధం ఎంత ఖరీదుది అయితే దాని ఫలం అంత విలువైనది అవుతుంది. ఉదాహరణకి‘ అదిగో అవినీతి.. అదిగదిగో కుంభకోణం’ అన్నవారు అందలాలు ఎక్కితే, జిడిపి హీరోగారు అగచాట్లు పడడం మన దేశంలో ఆ మధ్య చూశాక ఎంత పెద్ద అబద్ధం అయితే అంతపెద్ద కుర్చీ అని కొత్త భాషితం హోరెత్తుతోంది జనం నోళ్లలో. కుంభకోణములందు అబద్ధాలవి వేరయా అని అనేమాట తీయని తాటి బెల్లం అయిపోయింది. మరో కొత్త పోకడ.. దేశ భక్తి వీరంగం. దీన్ని కూడా పెద్ద అబద్ధ్దంగా మార్చారు. దేశ భక్తికి రుజువులు చూపమంటే తామ్రపత్రాలు .. స్వాతవతంత్య్ర యోధులకు ఇచ్చేవి చూపించలేకపోతున్నారు. కారణం వాళ్లు దాన్లోపాలోల్గోనే లేదు అని నిజం వినిపించబోతే అసలు ఆపోరాటమే అబద్ధ మంటారు. చరిత్రకి

మసి పూశారని అరుస్తారు. పిల్లల పాఠాల్లోంచి స్వాతంత్య్ర పోరాటం తీసెయ్యాలంటారు. ఇంతకీ జరగనిది ఏమిటి? 2జి స్కామ్ కాదా. ఓహో స్వాతంత్ర పోరాటమా.. చిత్తం చిత్తం. అలాగలాగే! ఎన్నికలు అబద్ధాలు ప్రేలుడు శక్తిని పెంచే సందర్భాలు అయిపోయాయి. దేశ భక్తిని కూడా సీన్‌లోకి లాక్కొచ్చి ‘శత్రు దేశంతో లాలూచీ చూడండి’ అంటూ పెద్దాయన గగ్గోలు. దేశ భక్తి అంటే గుర్తొచ్చింది. ‘మందు భక్తి’ తూలుడులో తెలుస్తుంది. ‘తిండి భక్తి’ హోటల్‌లో తెలుస్తుంది. కాని ఈ దేశ భక్త్తి తెలియాలంటే ఎలా? దానికి ఓ కొలబద్ద కనిపెట్టాలి. ప్రతీ ఒక్క రాజకీయ నాయకుడి దేశ భక్తిని కొలిచి రికార్డు చేయాలి. కనీసం ఇంత ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలని అర్హత నిర్ణయించాలి. తిక్క కుదురుతుంది!

Comments

comments