Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సైన్స్ కాంగ్రెస్ వాయిదా దురదృష్టకరం

revanth

ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/కొడంగల్: తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన ఉస్మానియా విద్యార్థులపై కెసిఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతల సాకు చూపి ఉస్మానియాలో నిర్వహించే సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక పంపించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అయన డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిధులు కొల్లగొడుతున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణలో బంగారాన్ని కెసిఆర్ ఉంచుకుని అప్పుల తెలంగాణ భారాన్ని ప్రజలపై మొపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 60సంవత్సరాలుగా 16మంది ముఖ్యమంత్రులు పాలించి రూ.69వేల కోట్ల రూపాయాల అప్పు చేస్తే, అధికారంలోకి వచ్చిన 42నెలల్లోనే లక్ష50వేల కోట్ల అప్పు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ కోసం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలకు చిత్తశుద్దిలేదని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు ప్రత్యేక హైకోర్టు ఆంశాన్ని లెవనేత్తడం హాస్యస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ బయటి నుంచి పూర్తి మద్దతు ఇస్తూ నేడు దొంగ నాటకాలకు తెరలేపారని విమర్శించారు. నోట్ల రద్దు,జిఎస్‌టిలకు కేంద్రానికి పూర్తి మద్దతు తెలిపిన టిఆర్‌ఎస్ పార్టీకి నాడు హైకోర్టు ప్రస్తవన గుర్తుకు రాలేదానని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు కల్లబోల్లి మాటలు చెప్పి ఆశల పల్లకిలో ముంచేత్తిన కేసిఆర్ నేడు ఇచ్చిన హామిలను మరిచారని ఆరోపించారు. అప్పుల ఊబిలో తెలంగాణాను ఓడ్డుకు చెర్చాలంటే అది కేవలం కాంగ్రేస్‌తోనే సాద్యమౌతుందని అయన పునరుద్ఘాటించారు.అంతకు ముందు అయన నివాసంలో చెపట్టిన పార్టీ అవిర్భవ కార్యక్రమంలో పార్టీజేండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి,శ్రీరాంరెడ్డి,యూసుఫ్,ప్రశాంత్,భవనప్ప,కృష్ణంరాజు,నర్సింహరెడ్డిలు పాల్గొన్నారు.

Comments

comments