Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కౌటాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

veduka

* హాజరైన ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప

మన తెలంగాణ/కౌటాల : గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సంస్థలను నెలకొల్పి పేద విద్యార్థులకు సేవ చేయడం చాలా గొప్ప విషయమని సిర్పూర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని ఇన్ ఫాంట్ జీసెస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మత గురువులు గ్రామీణ ప్రాంతంలో విద్యాసంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందించడం అభినందనీయమన్నారు. వారి జీవితాలను త్యాగం చేసి, ప్రజలకు సేవ చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. అదే విధంగా క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం క్త్రైవులకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం క్రైస్తవ మతం ఆదిలాబాద్ మేస్త్ర స్థానం గురు ఫాధర్ ఆంటోని మాట్లాడుతూ యేసు ప్రభువు అందరికి దేవుడని, ప్రజల శ్రేయస్సు కోసం యేసు పాటుపడ్డారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి  క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఫాదర్లు ప్రసాద్, వినోద్,  టిజో, నైజు, వివిధ చర్చీల ఫాధర్లు, సిస్టర్లు, జడ్‌పిటిసి డుబ్బుల నానయ్య,  రైతు సమన్వయ  సమితి జిల్లా క న్వీనర్ విశ్వనాథ్, ఐటిడిఏ డైరెక్టర్  కుంమ్రం మాంతయ్య, ఎస్‌ఐ అశోక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments