Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

శిఖర్ అర్ధశతకం.. భారీ ఆధిక్యం దిశగా భారత్

Shikhar-Dhawan

ఢిల్లీ: వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశకతం నమోదు చేశాడు. 83 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. మరో భారత బ్యాట్స్‌మెన్ పుజారా(49) వద్ద ఔటయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్ 356/9తో నాల్గో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 373 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులకు డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 10 పరుగుల వద్ద విజయ్(9) వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్య రహానే(10) మరోసారి నిరాశపరిచాడు.

రహానె పెవిలియన్ చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(49, 66బంతుల్లో)తన శైలికి భిన్నంగా వేగంగా ఆడాడు. అయితే తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా, ధావన్ జోడీ 77 పరుగుల భాగస్వామ్యం అందించింది. కెప్టెన్ కోహ్లీతో కలిసి వేగంగా ఆడే క్రమంలో ధావన్ (67) పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా 144 పరుగుల వద్ద ధావన్ రూపంలో నాల్గో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(15), రోహిత్(13) ఉండగా… భారత్ స్కోర్: 167/4(39 ఓవర్లు).  తొలి ఇన్నింగ్స్ 163 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ 330 పరుగుల ముందజలో ఉంది.

Comments

comments