Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

పంతుళ్లకు తాఖీదులు

stdnt

వంద మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
పది ప్రత్యేక తరగతులపై సీరియస్

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పదవ తరగతి ఫలితాలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. పదవ తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయిలో పరువు నిలబెట్టుకోవాలన్న లక్షంతో నిర్లక్షం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించడానికి జిల్లా విధ్యాశాఖాధికారులు సిద్ధం అవుతున్నారు. ఆగస్టు 28 నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన జిల్లా యంత్రాంగం దీనిపై నిర్లక్షం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతుంది. పదవ తరగతి ఫలితాలపై హయత్‌నగర్ మండలంలోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులతో ఈ నెల 5న జిల్లా విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి నిర్వహించారు. ఎస్‌ఎ 1, ప్రత్యేక తరగతులు, విద్యార్థుల తల్లితండ్రులతో సమావేశం, ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థులను దతత్త తీసుకుని పర్యవేక్షణ తదితర వాటిపై సమీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినా సమావేశానికి పలువురు ప్రధానోపాధ్యాయులు హాజరుకాకపోగా చాలా మంది ప్రధానోపాధ్యాయులు సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినప్పుడు హాజరుకావడాన్ని డిఇఓ సత్యానారాయణ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. నిర్లక్షం వహించిన ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేయడానికి సిద్ధం అయ్యారు. జిల్లాలోని దాదాపు వంది మంది ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం నుంచి షోకాజ్ నోటీసులు జారీచేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. జిల్లా పరిధిలోని 237 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరుకావలసి ఉండగా దాదాపు వంద మంది డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఎస్‌ఎ 1 పై నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని 90 పాఠశాలలలో 50 శాతం కన్నా తక్కువగా మార్కులు రావడంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిని సీరియస్‌గా తీసుకుని ఖచ్చితంగా వంద శాతం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పది ప్రత్యేకంపై సీరియస్…
పదవ తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా విద్యాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. పదవ తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించడానికి చేపట్టవలసిన చర్యలను ఇప్పటికే అందచేయడంతో ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నారు. పదవ తరగతి ఫలితాలను పెంచడానికి ఉదయం 8.30 నుంచి 9.30 వరకు సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ప్రతి సబ్జెక్ట్‌లో రోజు 20 ప్రత్యేక ప్రశ్నలు తయారు చేసి విద్యార్థుల ద్వారా జవాబులు రాబట్టాలి. తరగతిలో ప్రతి రోజు పరీక్షలు నిర్వహించాలి. పదవ తరగతి విద్యార్థులను ప్రతి ఉపాధ్యాయుడు దత్తత తీసుకుని విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులతో మాట్లాడి వారిని ముందుకు తీసుకుపోవాలి. ప్రధానోపాద్యాయుడితో పాటు ఉపాధ్యాయులు విద్యార్దుల తల్లితండ్రులకు ఫోన్ ద్వారా టచ్‌లో ప్రత్యేక తరగతులకు విద్యార్దులు హజరయ్యేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మండల విద్యాధికారులు సైతం తరచు దీనిని పర్యవేక్షించాలి. సెలబల్‌ను పూర్తి చేయడంతో పాటు రివిజన్ సైతం చేయవలసి ఉంటుంది. పదవ తరగతి పరీక్షల సమయం వచ్చే వరకు దీనిని ఉపాధ్యాయులు ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వచ్చే వరకు సమీష్టిగా ముందుకు సాగాలని లేని పక్షంలో కఠీన చర్యలు సిద్దం అవుతున్నారు. నిర్లక్షం వహించిన వారిపై చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు జారీచేయడానికి ప్రస్తుతం వంద మందికి షోకాజ్ నోటిసులు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు. డిఇఓ షోకాజ్ నోటిసులకు ఇవ్వడానికి సిద్దం అవుతుండగా దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మాత్రం గుర్రుగా ఉన్నాయి.

Comments

comments