Search
Sunday 27 May 2018
  • :
  • :

అక్రమాలను ప్రొత్సహిస్తున్న సర్పంచ్‌లపై కొరడా

bldg

 *మేడ్చల్ జిల్లాలో ఇద్దరు సర్పంచ్‌లు సస్పెండ్  * మరో 12 మంది సస్పెన్షన్‌కు షోకాజ్ నోటీసులు

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : గ్రామ పంచాయతీలలో అక్రమ లే అవుట్‌లు, నిర్మాణాలను ప్రొత్సహిస్తున్న సర్పంచ్‌లపై అధికారులు కొరడా ఝులిపించారు. అక్రమలే అవుట్‌లు, నిర్మాణాలకు బాధ్యులను చేస్తూ  14 మంది సర్పంచ్‌లపై చర్యలు చేపట్టారు. సోమవారం ఇద్దరు సర్పంచ్‌లను పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ 12 మంది సర్పంచ్‌ల సస్పెన్షన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ఇదివరకే 9 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. 22 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జి మెమోలు జారీ చేసి, ఇద్దరు సర్పంచ్‌లను సస్పెండ్ చేశారు. 119 మంది అక్రమ నిర్మాణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. తాజాగా జిల్లాలో అక్రమ లే అవుట్‌లు, నిర్మాణాలను పూర్తిగా అరికట్టే అక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి ఇద్దరు సర్పంచ్‌లను పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ 12 మంది సర్పంచ్‌ల సస్పెన్షన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ సర్పంచ్ నక్క వరలక్ష్మీ, కాచవాని సింగారం సర్పంచ్ స్వర్ణలతను పదవి నుంచి సస్పెండ్ చేశారు. కీసర మండలం దమ్మాయిగూడ సర్పంచ్ పి.అనురాధ, నాగారం సర్పంచ్ కె.చంద్రారెడ్డి, రాంపల్లి సర్పంచ్ ఎం.జ్యోతి, గోధుమకుంట సర్పంచ్ కే.అనీల్ కుమార్, కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్  సర్పంచ్ ఎస్.ప్రమీల, బాచుపల్లి సర్పంచ్ ఎ.పాండు, ప్రగతి నగర్  సర్పంచ్ కె.శాంత కుమారి, శామీర్‌పేట మండలం తూంకుంట గ్రామ సర్పంచ్ ఇ.నగేష్, దేవరయాంజాల్  సర్పంచ్ ఇ.శ్రీనివాస్, మేడ్చల్ మండలం యెల్లంపేట్ సర్పంచ్ తుడుం చిన్న లింగం, గుండ్లపోచంపల్లి  సర్పంచ్ బి.ఈశ్వర్, ఘట్‌కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడ గ్రామ సర్పంచ్ జి.మాదవి లకు షోకాజ్  నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్ మండలాల ఈఓపీఆర్‌డీలకు, అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ నిబంధనలకు విరుద్దంగా పాత సర్పంచ్‌ల సంతకాలతో వెలుస్తున్న అక్రమ లే అవుట్‌లపై సంతకాలు చేస్తున్న మాజీ సర్పంచ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈఓపీఆర్‌డీలను ఆదేశించారు.

Comments

comments