Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

GOLD

న్యూఢిల్లీ: బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ధర మూడు నెలల కనిష్ఠానికి చేరుకుంది. రూ. 100 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర పడిపోయినట్లు ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి ధర కూడా పడిపోయింది. కిలో వెండి ధర రూ. 375 తగ్గడంతో రూ. 38,125 వద్ద ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర పతనమైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Slightly Reduced Gold price Today.

Comments

comments